Jammu and Kashmir Encounter: నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు లాగుతూ, కశ్మీర్ లోయలో వరుస ఎన్‌కౌంటర్‌లు
కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో భారత సైన్యం, ఉగ్రవాదులను మట్టుబెడుతోంది.
రహస్య స్థావరాలపై దాడులు
జమ్ము, కశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మరోసారి ఉగ్ర కదలికలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు భారత సైన్యం గట్టి నిఘా పెడుతోంది.
ఉగ్రవాదులు దాక్కున్న రహస్య స్థావరాలను గుర్తించి నేరుగా దాడులు చేస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో షిర్మాల్ అనే ఓ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం వద్ద సైనికులు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. వెంటనే టెర్రరిస్ట్‌లు కాల్పులు జరపటం మొదలు పెట్టారు. భద్రతా దళాలతో పాటు పోలీసులు కూడా ఆ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
#Encounter has started at Shirmal area of #Shopian. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 25, 2022
All the best jk police. Hope you remain safe during this encounter
— SKP (@Angkesholey) June 25, 2022
ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్..
పోలీసుల కదలికల్ని గుర్తించి అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపటం వల్ల ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎల్ఓసీ వద్ద 150 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్లాన్ వేసుకున్నారని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. 500 నుంచి 700 మంది మిలిటెంట్లకు 11 క్యాంప్‌ల్లో శిక్షణ ఇస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని స్పష్టం చేశారు. మన్‌షేరా, కొట్లీ, ముజఫర్‌బాద్ ప్రాంతాల్లో ఈ ఉగ్ర క్యాంప్‌లున్నాయని ఆయన అన్నారు. అయితే ముష్కరులు ఎల్ఓసీని దాటి రాకుండా, మన సైనికులు కట్టడి చేస్తున్నారని వెల్లడించారు.
కొన్ని నెలలుగా ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య ఇలాంటి ఎన్‌కౌంటర్ ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆపరేషన్లలో ఉగ్రవాదులతో సహా వాళ్ల కమాండర్లను కూడా హతమార్చుతోంది భారత సైన్యం. జూన్ 15వ తేదీన లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కులగం జిల్లాలోని ఓ బ్యాంక్ మేనేజర్‌ని చంపినందుకు ఇలా ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు చనిపోయారని, వారిలో ముగ్గురు పాక్‌కు చెందిన వారని స్పష్టం చేశారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.
Also Read: DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!