Zimbabwe Elephants: ప్రజలకు ఏనుగు మాంసం పంపిణీ - ఏకంగా 200 ఏనుగుల్ని చంపేస్తున్న ప్రభుత్వం!
Zimbabwe News: ఎల్ నినో కారణంగా సౌత్ ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కరవును సృష్టించింది. ఆ కరువు దక్షిణ ఆఫ్రికాలో పంటలన్నీ నాశనం అయ్యాయి. ఫలితంగా ఆహార కొరత ఏర్పడి జింబాంబ్వేలో దారుణ పరిస్థితులు ఉన్నాయి.
Zimbabwe Elephants News: దక్షిణ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం అయిన జింబాబ్వేలో పరిస్థితులు చాలా దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆ దేశం గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం లేక విపరీతమైన ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజల ఆకలి తీర్చేందుకు సరిపడినంత ఆహారాన్ని అక్కడి ప్రభుత్వం అందించలేకపోతోంది. దీంతో ప్రజలకు ఆహారం అందించడం కోసం ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అందుకోసం దాదాపు 200 ఏనుగులను చంపాలని ప్రభుత్వం యోచిస్తోందని వన్యప్రాణుల అధికారులు సెప్టెంబరు 17న తెలిపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ప్రపంచంలో ఎల్ నినో కారణంగా సౌత్ ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కరవును సృష్టించింది. ఆ కరువు దక్షిణ ఆఫ్రికాలో పంటలన్నీ నాశనం అయ్యాయి. ఫలితంగా ఆహార కొరత ఏర్పడి.. దాదాపు 6.8 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.
మేం దేశవ్యాప్తంగా దాదాపు 200 ఏనుగులను చంపాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే, ఆ పద్ధతిని ఎలా అమలు చేయాలనే దానిపై ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నామని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జింపార్క్స్) ప్రతినిధి టినాషే ఫరావో రాయిటర్స్‌కు చెప్పారు. అందులో భాగంగా జింబాబ్వేలో కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలకు ఏనుగు మాంసాన్ని పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
1988 తర్వాత దేశంలోనే మొట్టమొదటి ఇలాంటి ఘటన కొన్ని జిల్లాల్లో జరుగుతోంది. పొరుగున ఉన్న నమీబియా గత నెలలో 83 ఏనుగులను చంపి.. కరువుతో ప్రభావితమైన ప్రజలకు మాంసాన్ని పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. జింబాబ్వే, జాంబియా, బోట్స్‌వానా, అంగోలా, నమీబియా లాంటి 5 దక్షిణాఫ్రికా దేశాలలో దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ ఏనుగులు ఉంటున్నాయని అంచనా. ఈ ప్రాంతమే ప్రపంచ వ్యాప్తంగా ఏనుగుల జనాభాలో ప్రధానంగా ఉంది.
55 వేల ఏనుగులు మాత్రమే ఉండాల్సిన జింబాంబ్వేలో ప్రస్తుతం 84 వేల ఏనుగుల జనాభా ఉంది. అందుకే తాజా నిర్ణయం ఏనుగుల జనాభాను తగ్గిస్తుందని ఫరావో చెప్పారు. ఇంత తీవ్రమైన కరవుతో, వనరుల కొరత కారణంగా మానవులు వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తీవ్రం అవుతాయి ఫరావో తెలిపారు. గతేడాది జింబాబ్వేలో ఏనుగుల దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు.