(Source: ECI/ABP News/ABP Majha)
7 Minutes Cancer Treatment: 7 నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స, ప్రపంచంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్‌లో అందుబాటులోకి
7 Minutes Cancer Treatment: క్యాన్సర్ చికిత్సకు 7 నిమిషాల్లోనే చికిత్స పూర్తయ్యే ఔషధాన్ని బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చింది.
7 Minutes Cancer Treatment: క్యాన్సర్ ఓ మహమ్మారి. అత్యంత ప్రమాదకరమైనది. సరైన సమయంలో, సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు. ఆ చికిత్స కూడా ఎంతో కష్టంగా, బాధాకరంగా ఉంటుంది. క్యాన్సర్ చికిత్స వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిన్నింటిని తట్టుకుని బతికితీరాలన్న సంకల్పం, పట్టుదల, మానసిక మద్దతు ఉంటే క్యాన్సర్ ను జయించవచ్చు. ఈ మహమ్మారిని తగ్గించడానికి, సులువైన చికిత్స అందించడానికి ప్రపంచవ్యాప్తంగా నిత్యం ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అధునాతన వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చిన చికిత్స ఇప్పుడు వైద్య రంగంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలో కేవలం 7 నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తి అవుతుంది. క్యాన్సర్ రోగికి ఇచ్చే ఇంజెక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు బ్రిటన్ హెల్త్ సర్వీసెస్ తాజాగా ఆమోదం తెలిపింది.
గంట చికిత్స 7 నిమిషాలకు తగ్గింపు
ప్రపంచంలోనే మొదటి సారిగా ఈ చికిత్సను ఇంగ్లాండ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆవిష్కరణ చికిత్సా సమయాన్ని మూడు వంతులు తగ్గించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. క్యాన్సర్ రోగులకు ఇమ్యునోథెరపీలో భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్ ను డ్రిప్ ద్వారా చర్మం కింద ఇస్తారు. ఇందుకు 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు సమయం పడుతుంది. కానీ తాజాగా ఆమోదించిన ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఇవ్వవచ్చు. ఈ కొత్త చికిత్స విధానం వల్ల అటు క్యాన్సర్ రోగులకు, వైద్యులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.
రోగులకు, వైద్యులకూ మేలు
ఈ 7 నిమిషాల ఇంజెక్షన్ కు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(MHRA) 7 నిమిషాల చికిత్సకు ఆమోదం తెలిపింది. అలా ఆగస్టు 29వ తేదీన 100 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఇంజెక్షన్ ను ప్రయోగాత్మకంగా అందించారు. రొమ్ము, మూత్రాశయ, ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స అందించనున్నట్లు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. ఈ ఇంజెక్షన్ వల్ల అటు రోగులకు అనుకూలంగా ఉండటమే కాదు.. వైద్యులు కూడా ఎక్కువ మంది బాధితులకు చికిత్స చేయాడనికి వీలు కలుగుతుందనని ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అటెజోలిజుమాబ్ ఇమ్యునోథెరపీ ఔషధం.. క్యాన్సర్ కణాలను వెతికి నాశనం చేస్తుంది. అలాగే క్యాన్సర్ రోగుల్లో ఇమ్యూనిటీ పవర్ ను శక్తివంతం చేస్తుంది. ఇంగ్లాండ్ లో ఏటా దాదాపు 3,600 మంది క్యాన్సర్ రోగులు సమయాన్ని ఆదా చేసే అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్ కి మారాలని భావిస్తున్నట్లు NHS ఇంగ్లాండ్ తెలిపింది. అయితే అటెజోలిజుమాబ్ తో కలిసి ఇంట్రావీనస్ కిమోథెరపీ చేసుకునే రోగులు రక్తమార్పిడి చేయించుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. సాధారణంగా శరీరంలోని అసాధారణ కణాలు రోగ నిరోధక వ్యవస్థలోని టీ కణాల నుంచి తప్పించుకుని, కణితులుగా మారి పలు రకాల క్యాన్సర్లకు దారి తీస్తాయి.