
North Korea: అక్కడ మహిళా సైనికులకు లైంగిక వేధింపులు, మత్తుమందు లేకుండా అబార్షన్లు
ఉత్తర కొరియాలో సైన్యంలోని మహిళలు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఓ మహిళా సైనికురాలు తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది.

ఉత్తర కొరియాకు చెందిన ఒక మహిళా సైనికురాలు కిమ్ జోంగ్ ఉన్ సైన్యంలో తాను ఎదుర్కొనే బాధలను చెప్పింది. అక్కడ ఆమె లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపింది. అంతేకాదు.. అనస్థీషియా లేకుండా అబార్షన్లు, పోషకాలు లేని ఆహారం అందిస్తున్నట్టు వివరించింది.
తనతోపాటుగా మహిళా సైనికులు సైన్యంలో గడిపిన కష్టతరమైన జీవితాన్ని వివరించింది ఆమె. కిమ్ సైన్యంలో 70 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పింది. అక్కడ కొన్ని మెుక్క జొన్నలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు అని చెప్పారు. సరైన పోషకాహారం ఇవ్వరని.. అంతేకాదు సమూహంగా శిక్షలకు గురిచేస్తారని ఆమె తెలిపింది. శానిటరీ ప్యాడ్స్ కూడా.. సరైనవి ఇవ్వకుండా ఇచ్చినవే.. ఉపయోగించాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది.
23 ఏళ్ల జెన్నిఫర్ కిమ్ అనే మహిళా సైనికురాలు ఈ సమస్యలన్నీ ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత ఆమెను సైన్యం నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది. 'తడిగా ఉన్న ఫుట్‌వ్రాప్‌లను శానిటరీ ప్యాడ్‌లుగా ఉపయోగించాలని ఒత్తిడి చేశారు. క్రూరమైన సామూహిక శిక్షలు వేసేవారు. చేతులు చల్లటి నీటిలో పెట్టి.. ఆపై అరచేతులకు ఐస్ గడ్డలు కట్టి.. ఇనుప కడ్డీలకు వేలాడదీస్తారు. నాతో సహా ఉత్తర కొరియా సైన్యంలోని 70 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు.' అని ఆమె తెలిపింది.
ఒక ఆఫీసర్ తన దగ్గరకు వచ్చి.. లైంగిక వేధింపులకు గురి చేశాడని జెన్నిఫర్ తెలిపింది. అయితే.. అతను అడిగినది తిరస్కరిస్తే, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో సభ్యులుగా ఉండలేమని చెప్పింది. పార్టీలో లేకుండా.. బయటకు వస్తే.. సమాజంలో వింతగా చూస్తారని.. జీవితాంతం బాధపడేలా చేస్తారని పేర్కొంది. ఉద్యోగమే కాదు.. వివాహం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా సమస్యగా మారుతుందని వెల్లడించింది. చివరికి అతని చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాను అని జెన్నిఫర్ ఆవేదనతో చెప్పింది.
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

