Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!
Elon Musk Twitter: ట్విట్టర్‌లో ఏం జరుగుతుందో అన్నీ తాము గమనిస్తూనే ఉంటామని వైట్ హౌస్ ప్రకటించింది.
Elon Musk Twitter: ట్విట్టర్‌ను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk)టేకోవర్ చేసిన తర్వాత రోజుకో మార్పులు జరుగుతున్నాయి. లేఆఫ్‌లు, బ్లూ టిక్, వాక్ స్వాతంత్రం అంటూ మస్క్ రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం (వైట్ హౌస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ కార్యకలపాలపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందని తెలిపింది.
మస్క్ ట్వీట్
ఈ మంగళవారం ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ ఆసక్తికర ట్వీట్ చేసారు. ట్వీట్‌లో మాస్క్ ఇది భవిష్యత్ నాగరికత కోసం జరుగుతున్న యుద్దం అని పేర్కొన్నారు.
This is a battle for the future of civilization. If free speech is lost even in America, tyranny is all that lies ahead.
— Elon Musk (@elonmusk) November 29, 2022
The Twitter Files on free speech suppression soon to be published on Twitter itself. The public deserves to know what really happened …
— Elon Musk (@elonmusk) November 28, 2022
మస్క్ చేపట్టకముందు ట్విట్టర్‌లో ఫ్రీ స్పీచ్‌పై కాస్త కఠినంగా ఆంక్షలు ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతానే సస్పెండ్ చేసింది ఆ సంస్థ.
Also Read: Odisha News: జడ్జినే కత్తితో పొడవబోయిన దుండగుడు- విచారణ ఆలస్యమైందని!