(Source: ECI/ABP News/ABP Majha)
ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !
సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా.? ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే ఏం అవుతుంది. ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒకటి.
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒకటి. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబంలోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలో తిరుగుతుంటాయి. భూభ్రమణం వల్లనే సూర్యోదయాస్తమయాలు వస్తాయి. అయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తే మనకు రోజు మొదలవుతుంది. పశ్చిమాన అస్తమిస్తే రోజు ముగుస్తుంది. ఎన్నో వేల ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఇది. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి మూలాధారం సూర్యుడు. అలాంటి సూర్యుడు ఉదయించకపోతే భూమి మొత్తాన్ని చీకట్లు కమ్ముకుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించాలంటే వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ పరిణామం మనిషి మూడ్‌ని మార్చేస్తుంది. అంతేకాదు. కేవలం సూర్య కిరణాల ద్వారానే బ్రతికే జీవరాశులు కనుమరుఅయిపోతాయి. ఇక మొక్కలు.. ఆకులు ఆహరం తయారు చేసుకోలేక, చనిపోతాయి. దీంతో కిరణ జన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. 40 డిగ్రీల టెంపరేచర్ కాస్తా 10 లేదా 8 డిగ్రీలకు పతనమవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. సముద్రంలో, నదుల్లో, చెరువుల్లో చేపలకు అవసరం అయ్యే ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి. అయితే ఇలా సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఏమైన ఉన్నాయంటే.. కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి.
ఇటలీలోని విగనెల్లా:
ఇటలీలోని విగనెల్లా అనే గ్రామంలో నవంబర్ నెలలో పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోతుంది. మళ్లీ ఫిబ్రవరి వరకూ అదే పరిస్థితి ఉంటుంది. ఎత్తైన కొండల మధ్యలో ఉన్న లోయలో ఎక్కడో కూరుకుపోయినట్టు ఉంటుందా గ్రామం. దాంతో.. ఆ గ్రామప్రజలు ప్రతిఏటా ఓ మూడు నెలల పాటు సూర్యోదయాన్ని చూడలేరు. అంతేకాదు.. చుట్టూతా కొండలు ఉండటంతో సూర్యకిరణాలు కూడా వారిని తాకవు. దీంతో..అక్కడ మూడు నెలల పాటు అంధకారమే రాజ్యమేలుతుంది. అయితే ప్రస్తుతం విగనెల్లా గ్రామంలోని ఎత్తైన కొండపై భారీ అద్దన్ని సూర్యుడికి ఎదురుగా ఉంచి, ఆ ప్రతి బింబాన్ని ఆ గ్రామంపై పడేలా చేసుకుని, తమ జీవితాల్లో ఉన్న చీకటిని జయించారు.
నార్వే దేశంలోని జుకన్:
విగనెల్లా గ్రామంలాంటి ఇంకో గ్రామం ఉంది. అదే నార్వే దేశంలోని జుకన్ అనే గ్రామం. ఇక్కడ కూడా సూర్యుడు ఉదయించడు. చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాల మధ్యలో ఈ గ్రామం ఉండటంతో సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు. ఇలా సెప్టెంబర్ నెల మార్చి నెల వరకు సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు. అయితే సూర్యుడి కాంతిలేక తీవ్ర ఇబ్బందులు పడిన ఈ గ్రామస్తులు.. అందరూ భారీ మొత్తంలో డబ్బును చెందాల రూపంలో పోగు చేసుకుని 530అడుగుల ఎత్తులో ఉన్న కొండపై అద్దాలను ఉంచారు. కొండపై ఉన్న గ్లాస్‌పై సూర్యకిరణాలు పడి.. ఆ రిప్లెక్షన్ను ఆ గ్రామంపై పడేచేశారు.
నార్వే దేశంలోని లాంగియర్ బెన్:
లాంగియర్ బెన్ అనే ప్రాంతంలో విచిత్రంగా రాత్రి పగలు రెండూ ఉంటాయి. ఇందులో విచిత్రం ఏమి ఉంది.? అది ఎక్కడైన ఉంటుందిగా.? అంటే అసలు కాదు. ఎందుకంటే.. ఈ గ్రామంలో నాలుగు నెలల పాటు 24గంటల పాటు సూర్యూడు ఉదయిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మరో నాలుగు నెలల పాటు అసలు సూర్యుడే కనిపించడు. 24గంటల పాటు చీకటే ఉంటుంది. ఈ ప్రాంతంలో గడియారం లేకపోతే.. సమయాన్ని అసలు అంచనా వేయలేం.