Viral Video: సౌదీలో థ్రిల్ రైడ్ విషాదం: 23 మందికి గాయాలు, వైరల్ వీడియోలో భయానక దృశ్యాలు!
Viral Video: సౌదీలో జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. పార్క్‌లోని రైడ్ ఒకటి జనాలతో తిరుగుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది.

Viral Video: సౌదీఅరేబియాలో ఘరో ప్రమాదం జరిగింది. జూలై 31న హడా ప్రాంతంలోని గ్రీన్ మౌంటైన్ పార్క్‌లో ఓదారుణమైన ఘటన జరిగింది. జనాలతో ఉన్న థ్రిల్‌రైడ్ ప్రమాదానికి గురైంది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో జనాలు కొంత ఆనందం, మరికొంత థ్రిల్‌తో సాగుతున్న రైడ్ చక్రం ఒక్కసారిగా ఊడిపడింది. కిందికి దిగుతున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మంది పర్యాటకులు గాయపడ్డారు.
సౌది అరేబియాలోని తైఫ్‌లోని పార్క్‌లో ఈ ఘటన జరిగింది. రైడ్ జరుగుతున్న టైంలో పర్యాటకులు తీసిన ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 360 డిగ్రీలు తిరిగే పెండ్యూలమ్ స్టైల్ రైడ్‌లో దుర్ఘటన జరిగింది. 30 మందితో ఊయల మాదిరిగా ఊగుతున్న టైంలో రైడ్‌కు ఉన్న స్టాండ్ విరిగిపోయింది. దీంతో రైడ్‌లో కూర్చొని ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు.
Horrific ride malfunction in Saudi Arabia
— Nabila Jamal (@nabilajamal_) July 31, 2025
A "360-degree" amusement ride broke mid-air at Green Mountain Park in Taif
At least 23 people injured while on board
Visuals show the ride snapping in half pic.twitter.com/xr25xOAcFa
పర్యాటకులంతా కూర్చొని రైడ్ మొదలవుతున్న టైంలో ఈ ఘటన జరిగింది. ముందు ఓవైపు తిరుగుతుంది. రెండోవైపు వచ్చి కిందికి దిగుతున్న టైంలో రైడ్‌కు మధ్యలో ఉన్న పోల్‌ను గట్టిగా పట్టుకొని ఉండాల్సిన పట్టీ ఒకటి ఊడిపోయింది. దీంతో రైడ్ పోల్ మధ్యకు విరిగిపోయింది. రైడ్‌లోని చక్రం సపోర్టింగ్ పోల్స్‌కు ఢీ కొట్టి కిందడింది. రైడ్‌లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయారు. కొందరు అల్లాంత దూరాన ఎగిరిపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. క్షతగాత్రులనుఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన తర్వాతా పార్క్‌ను కాసేపు మూసివేశారు. అన్ని రైడ్‌లను క్యాన్సిల్ చేశారు. అన్నింటిలో అధికారులు తనిఖీలు చేసిన తర్వాతే పర్యాటకులు రైడ్ చేసేందుకు అనుమతి ఇస్తామన్నారు. మొత్తం ఆ ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేస్తున్నారు.





















