Viral Video: ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది - వైరల్ వీడియో
Viral Video: ఇంగ్లాండ్‌లోని ఓ పార్క్‌లో రోలర్‌కోస్టర్ మధ్యలో ఆగిపోయి అందరినీ భయపెట్టింది.
Viral Video:
మధ్యలో ఆగిన రోలర్‌కోస్టర్
రోలర్‌కోస్టర్ ఎక్కడం వరకూ సరదాగానే ఉంటుంది. ఎక్కిన తరవాతే అసలు కథ మొదలవుతుంది. అందుకే కొంతమంది కింది నుంచి చూసి ఎంజాయ్ చేస్తారే తప్ప పొరపాటున కూడా ఎక్కరు. అంత అడ్వెంచరస్‌గా ఉంటుందీ రైడ్. ఒక్కోసారి పట్టుతప్పి ప్రమాదాలూ జరుగుతుంటాయి. ఇంగ్లాండ్‌లో ఇటీవల అదే జరిగింది. అడ్వెంచర్ ఐల్యాండ్ (Adventure Island)లో 72 అడుగుల ఎత్తైన రోలర్‌కోస్టర్‌ని ఎక్కారు కొందరు. కొంత సేపటి వరకూ రైడ్ బాగానే సాగినా ఉన్నట్టుండి మధ్యలో ఆగిపోయింది. అంత ఎత్తులో ఆగిపోతే గుండెలు అదిరిపోవూ..! ఎందుకిలా ఆగిపోయిందో అర్థం కాక వణికిపోయారు అందులో ఉన్న వాళ్లంతా. నానా తంటాలు పడి మొత్తానికి వాళ్లందరినీ కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ...ఆ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం వాళ్లు లైఫ్‌లో మర్చిపోలేరు. ప్రత్యక్ష సాక్ష్యులు కొందరు ఇది ఎలా జరిగిందో వివరించారు.
"చాలా ఎగ్జైటింగ్‌గా అందరూ రోలర్ కోస్టర్ ఎక్కారు. కాసేపు లూప్‌లో అటూ ఇటూ ఊగారు. పైకి వెళ్లగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఎందుకలా స్ట్రక్ అయిందో మాకు అర్థం కాలేదు. అందరూ గట్టికా కేకలు పెట్టారు. నిలువునా ఉన్నప్పుడు స్ట్రక్ అవడం వల్ల కింద పడిపోతారేమో అని భయం వేసింది. దాదాపు 45 నిముషాల పాటు వాళ్లు అలాగే ఉండిపోయారు. అదృష్టం ఏంటంటే..ఇక్కడి నిర్వాహకులు వెంటనే స్పందించి వాళ్లు ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా కిందకు దించారు. ఏ కాస్త అటు ఇటైనా వాళ్ల ప్రాణాలకే ప్రమాదం ఉండేది"
- ప్రత్యక్ష సాక్షి
Breaking news. A roller coaster at Southend Theme Park has broken down leaving riders stuck on the lift.#Southend #Rollercoaster pic.twitter.com/td1oYnFQgV
— Supplement Warehouse (@SuppWarehouseUK) July 28, 2023
గతంలో అమెరికాలోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ లోనూ ఇలాగే జరిగింది. చాలా మంది రోలర్ కోస్టర్ రైడ్ కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తెలత్తింది. మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది.. రైడ్ కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ... అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏమాత్రం పట్టు తప్పినా వారి ప్రాణాలు పోయేవే. ఇలా మూడు గంటల పాటు ప్రజలంతా ప్రాణాలు అర చేత పట్టుకొని అలాగే ఉండిపోయారు. మూడు గంటల తర్వాత సమస్యను పునరుద్ధరించి వారందరినీ క్షేమంగా కిందకు దించారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇంత భయంకరమైన రైడ్ నేనెప్పుడూ చూడలేదని కొందరు.. ఎక్స్ పీరియన్స్ అదిరిందా ఫ్రెండ్స్ అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction.
— Sasha White (@rusashanews) July 4, 2023
Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ
Also Read: మా రాహుల్‌కి మీరే అమ్మాయిని చూసి పెట్టండి, మహిళా రైతుతో సోనియా సరదా సంభాషణ