By: ABP Desam | Updated at : 01 Aug 2023 02:47 PM (IST)
Edited By: Pavan
షర్ట్ లేకుండా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు - గాగుల్స్, క్యాప్‌తో హీరోలా పోజులు ( Image Source : twitter/ericgeller )
Viral Pic: నిత్యం రకరకాల బాధ్యతలు, విధులతో బిజీ బిజీగా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతున్నారు. అమెరికాలోని ఓ సముద్ర తీరంలో బీచ్ డేను ఎంజాయ్ చేస్తున్నారు. షర్ట్ లేకుండా.. షార్ట్ ధరించి, ఆవియేటర్ సన్ గ్లాసెస్ పెట్టుకుని, తలపై బేస్ బాల్ క్యాప్ ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపించారు. ప్రస్తుతం జో బైడెన్ కు సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 80 ఏళ్ల జో బైడెన్ ప్రస్తుతం డెలావర్ లోని రెహోబోత్ వద్ద ఉన్న బీచ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు బీచ్ లో సరదాగా గడిపారు. తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి కాసేపు సముద్ర తీరాన సేదతీరారు. లాంగ్ బ్లూ స్విమ్మింగ్ ట్రంక్స్, బ్లూ టెన్నిస్ షూస్, బ్యాక్ వార్డ్స్ బేస్ బాల్ క్యాప్, ఆవియేటర్ సన్ గ్లాసెస్ ధరించారు. తీరంలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ బీచ్ లో కలియదిరిగారు. జో బైడెన్ ఉత్సాహాన్ని చూసిన జర్నలిస్టు ఎరిక్ గెల్లెర్ షర్ట్ లెస్ బైడెన్ ను ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఎరిక్ గెల్లర్. రెహోబోత్ బీచ్ లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డేను ఆస్వాదిస్తున్నారు అంటూ బైడెన్ ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాను బీచ్ లో నడుస్తూ వెళ్తున్నప్పుడు బైడెన్ ను గమనించి, తన సెల్ ఫోన్ తో మూడు ఫోటోలు క్యాప్చర్ చేశానని.. ఎరిక్ గెల్లర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో జో బైడెన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉందని కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
President Biden is enjoying a gorgeous beach day here in Rehoboth. pic.twitter.com/AZmhRHHf0Y
— Eric Geller (@ericgeller) July 30, 2023
దేశాధ్యక్షులు ఇలా షర్ట్ లేకుండా కనిపించడం కొత్తేమీ కాదు. ఇలా బాడీ ఫిట్ నెస్ ను చూపించడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుంటారు. షర్ట్ లేకుండా సన్ గ్లాసెస్ ధరించి హీరో లాంటి పోజులు ఇవ్వడంలో పుతిన్ తర్వాతే ఎవరైనా. 2009 లో షర్ట్ లేకుండా హార్స్ రైడ్ కు వెళ్లిన పిక్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు పుతిన్. అప్పట్లో పుతిన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కాగా.. వాటికి అలా సమాధానం చెప్పారు రష్యా అధ్యక్షుడు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన శారీరక దృఢత్వాన్ని నిరూపించడం కోసం చేసిన పని అప్పట్లో నవ్వులు పూలు పూయించింది. సిల్వస్టర్ స్టాలోన్ కండలు తిరిగిన శరీరానికి తన తలను తగిలించిన ఆ ఫోటోను సోషల్ మీడియాలో స్వయంగా ట్రంపే షేర్ చేశారు. ప్రస్తుతం జో బైడెన్ షర్ట్ లెస్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆహారం అందిస్తుండగా దాడి చేసిన సింహం, ప్రాణాలు కోల్పోయిన జూ కీపర్
కరాచీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, వీధిలోనే కాల్చి చంపిన దుండగులు
టర్కీ పార్లమెంట్‌కి సమీపంలో ఆత్మాహుతి దాడి, మంత్రి ఆఫీస్ గేట్ బయటే ఘటన
యూకేలో సిక్కు రెస్టారెంట్ ఓనర్ కార్లపై దాడి, ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడనే!
అఫ్గనిస్థాన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలోని రాయబార కార్యాలయం మూసివేత - భారత్ సహకరించడం లేదని అసహనం
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>