By: ABP Desam | Updated at : 26 Apr 2022 10:45 PM (IST)
Edited By: Murali Krishna
కమలా హారిస్‌కు కరోనా పాజిటివ్- ప్రకటించిన వైట్ హౌస్
Kamala Harris Covid Positive: కమలా హారిస్‌కు కరోనా సోకింది. అమెరికా ఉపాధ్యక్షురాలికి కరోనా సోకినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్‌కు కరోనా వచ్చింది.
అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. కొత్తగా 34,908 కరోనా కేసులు బయటపడ్డాయి. 141 మంది వైరస్‌కు బలయ్యారు.
#BREAKING US Vice President Kamala Harris tests positive for Covid: White House pic.twitter.com/Ay0lLjWT5g
— AFP News Agency (@AFP) April 26, 2022
భారత సంతతికి చెందిన కమలా హారిస్ 2020లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ పదవి చేపట్టిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా కమల రికార్డు సృష్టించారు.
అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా పనిచేసిన దాఖలాలు లేవు. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. కానీ ఈ పదవిని అలంకరించిన తొలి మహిళగా కమలా హారిస్ నూతన అధ్యాయం లిఖించారు.
తమిళనాడు మూలాలు
1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు. తమిళనాడులోని చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది.
కమల.. తాతగారు పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. చెన్నై స్సెషల్ ఇడ్లీ సాంబార్ అంటే కమలకు చాలా ఇష్టం.
Also Read: Tej Pratap Yadav: లాలూకు మరో షాక్- పార్టీకి పెద్ద కుమారుడు గుడ్‌బై
US President strong Warning to China: చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Australia Elections: ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్ పరిపాలనకు తెర- కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!