సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
US military aircraft crash: అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద సముద్రంలో కూలిపోయింది.
US Military Aircraft Crashes:
అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (Osprey Aircraft Crash) ఘోర ప్రమాదానికి గురైంది. జపాన్‌లోని యకుషిమ ద్వీపం సమీపంలోని సముద్రంలో కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో 8 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. జపాన్ కోస్ట్ గార్డ్‌కి చెందిన ప్రతినిధులు ఈ ఘటనపై స్పందించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఆ 8 మంది సిబ్బంది ఎలా ఉన్నారన్నదీ స్పష్టత లేదని వెల్లడించారు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 నిముషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఎడమ వైపున ఉన్న ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయని, ఆ తరవాత సముద్రంలో కూలిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అన్నీ సేకరిస్తున్నామని అమెరికా వెల్లడించింది. గతేడాది ఆగస్టులోనూ అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో 23 మంది ఉన్నారు.
అమెరికాలో ఇలా..
అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల ఘోర ప్రమాదం (Texas Aircraft Crash Video) జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న విమానం అదుపు తప్పి కార్‌పై దూసుకెళ్లింది. నవంబర్ 13న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని మిడ్‌లాండ్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్‌ని కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే...రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి అదుపు తప్పింది. Aero County Airport వద్ద ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఆగాల్సి ఉన్నా అది ఆగలేదు. ఎదురుగా వస్తున్న కార్‌పైకి దూసుకుపోయింది. కార్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇద్దరికి, కార్‌లో ఒకరికి గాయాలయ్యాయి. మెడికల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యక్ష సాక్ష్యులు ఈ వీడియో తీశారు. ఎయిర్‌క్రాఫ్ట్ అదుపు తప్పిందని తెలుసుకున్న వెంటనే ఆ విజువల్స్‌ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. చాలా వేగంగా వచ్చి రన్‌వేని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. విమానం దిగిన తీరుని చూసే అది సరైన విధంగా ల్యాండ్ అవ్వదని ఊహించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. Federal Aviation Administration (FAA) రంగంలోకి దిగి విచారణ చేపట్టనుంది. ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. బాధితులు ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
One car careened straight into the equally careening plane just outside Aero County Airport, in McKinney, Texas pic.twitter.com/H0cTLlIDMl
— RT (@RT_com) November 14, 2023
Also Read: China Pneumonia Outbreak: చైనా ఫ్లూ కేసులపై ఆ 5 రాష్ట్రాలు అప్రమత్తం, చిన్నారులు జాగ్రత్త అంటూ హెచ్చరికలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply