Viral News: హార్వార్డ్ కు లేఖ రాసిన అమెరికా విద్యామంత్రి - తమ్ముడు సినిమాలో పవన్ కల్యాణ్ లెటర్ గ్రామరే బెటర్ - నవ్వులపాలు
US Education Secretary : ఆమె అమెరికా విద్యా మంత్రి. ప్రపంచంలోనే దిగ్గజ వర్శిటీ అయిన హార్వార్డ్ లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ ఆమె పరువు తీస్తోంది.

US Education Secretary Mocked For Bad Grammar: తమ్ముడు సినిమాలో పవన్ కల్యాణ్ తన సోదరుడు అచ్యుత్ ను మాయ చేయడానికి వేరే వాళ్లు రాసినట్లుగా ఓ లేఖ రాస్తాడు. ఆ లేఖలో తెలుగు గ్రామర్ ను అర్థం చేసుకోవడానికి అచ్యుత్ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అది సినిమా సీన్. నిజంగానే ఇలాంటి ఓ లేఖను అమెరికా విద్యా మంత్రి రాశారు. అది కూడా హార్వార్డ్ విశ్వ విద్యాలయానికి. అక్కడి మాస్టార్లు ఊరుకుంటారు. ఆ లేఖను చీల్చి చెండాడి.. ఇల్లిటరేట్ అని విద్యామంత్రిపై ముద్రపడేలా చేశారు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హార్వార్డ్ యూనివర్శిటీకి నిధులు అందించకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని చెబుతూ విద్యాశాఖ సెక్రటరీగా ఉన్న లిండా మెక్‌మెహన్ హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ డాక్టర్ అలాన్ గార్బర్‌కు మే 5, 2025న ఒక లేఖ రాశారు. ఈ లేఖలో హార్వర్డ్ యూనివర్శిటీ ఫెడరల్ గ్రాంట్‌ల కోసం ఇకపై దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని ..ఇకపై ఇచ్చేది లేదని ఆపేశామని ఆ లేఖలో చెప్పారు. హార్వర్డ్ యూనివర్శిటీ అమెరికా ఉన్నత విద్య వ్యవస్థను అవమానించిందని లిండా లేఖలో ఆరోపించారు. యాంటీసెమిటిజం, జాతి వివక్ష, విద్యా ప్రమాణాల క్షీణత, దృక్పథ వైవిధ్యం లేకపోవడం వంటి ఆరోపణలను చేశారు.
our secretary of "education" https://t.co/ds5cwk0uHl pic.twitter.com/4MR4DEydUZ
— daniel (michelle steel hate account) (@danielluo_pi) May 6, 2025
లేఖలో ఆమె చేసిన ఆరోపణల సంగతి పక్కన పెడితే.. అందులో అనేక వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు ఉండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెక్‌మోహన్ లేఖను X ( ట్విట్టర్)లో పోస్ట్ చేసిన తర్వాత వైరల్ అయ్యింది. నెటిజన్లు తప్పులు ఎత్తిచూపుతూ "బేర్లీ లిటరేట్" , "ఇల్లిటరేట్ రాంబ్లింగ్" అని ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. కొంతమంది X వినియోగదారులు లేఖను రెడ్ ఇంక్‌తో సవరించి, వ్యాకరణ, స్పెల్లింగ్ దోషాలను హైలైట్ చేసి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Did a high school kid write this? You’re the Secretary of “Education” and this is a chaotic mess of bad grammar and illiterate rambling. You poked the bear and you’re too stupid to even know it.
— Fred Wellman (@FPWellman) May 6, 2025
లిండా మెక్‌మోహన్ హార్వర్డ్ యూనివర్శిటీకి రాసిన లేఖ దానిలోని వ్యాకరణ దోషాలు , రాజకీయ ఆరోపణల కారణంగా వైరల్ అయింది. ట్రంప్.. ప్రభుత్వం నిధులను విడుదల ఆపేయడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
"Dear Harvard,
— KILL, THE ICON! (@KILLTHEICON) May 6, 2025
You dumb, me smart.
Me no give you money any more.
Unless you give me more money.
Me very smart."





















