Unschooling: స్కూల్‌కు పంపరు.. స్కూలే ఇంటికి రావాలట - అన్‌స్కూలింగ్ ఇప్పుడు ఓ ట్రెండ్ - ఇదేంటో తెలుసా ?
US: అమెరికాలో అన్ స్కూలింగ్ ఓ ట్రెండ్‌గా మారుతోంది. పిల్లలను తల్లిదండ్రులు స్కూలుకు పంపేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Unschooling in US: ఎవరైనా తమ పిల్లలు స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాలని అనుకుంటారు. కానీ అమెరికన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. స్కూలే మా ఇంటికి రావాలని అనుకుంటున్నారు. అన్ స్కూలింగ్ పేరుతో ఇప్పుడు ఈ పద్దతి బాగా పాపులర్ అవుతోంది. అన్ స్కూలింగ్ కు ఇటీవలి కాలంలో మద్దతు పెరుగుతోంది.
అన్‌స్కూలింగ్ అంటే ?
అన్‌స్కూలింగ్ (Unschooled) అంటే పిల్లలుు స్కూల్‌లలో చదువు పొందకుండా, అనువైన, వ్యక్తిగత, స్వేచ్ఛతో నేర్చుకునే విధానం. సాధారణగా స్కూలుకు వెళ్లి చదువుకోవడం కాకుండా పిల్లలు ఇంటి దగ్గరే చదవుకోవడాన్ని అన్ స్కూలింగ్ అనుకోవచ్చు. వివిధ అనుభవాలతో, గేమ్స్, ప్రాజెక్టులు, ప్రయోగాలు, సందర్శనలు వంటి పద్ధతుల ద్వారా ఇంటి దగ్గరే పాఠాలు నేర్చుకుంటారు. పిల్లల ఆసక్తి ఆధారంగా నేర్చుకోవడం ఈ అన్‌స్కూలింగ్ కాన్సెప్ట్. పిల్లలు ఏదైనా ఒక విషయం పై ఆసక్తి చూపినప్పుడు, ఆ విషయం మీద సమయం గడుపుతూ నేర్చుకుంటారు. అలాంటి సమయం వారికి ఇవ్వాలని స్కూల్‌కు పంపకూడదని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అన్ స్కూలింగ్ వల్ల పిల్లలు వారి నేర్పుని, శిక్షణను స్వతంత్రంగా నిర్ణయించుకుంటారని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో అన్ స్కూలింగ్‌కు పెరుగుతున్న సపోర్టు
అమెరికాలో ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ , సోషల్ మీడియా గ్రూపులు అన్‌స్కూలింగ్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. "Unschooling" పై విభిన్న బ్లాగులు, ఫోరాలు, వీడియోలు గ్రూపులు ఇంటర్నెట్ పెరిగిపోతున్నాయి. అన్‌స్కూలింగ్‌లో పిల్లలు ప్రాముఖ్యంగా అనుభవాలపై దృష్టి పెడతారు. అందుకే ఆదరణ భారీగా పెరుగుతోంది. కానీ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అన్‌స్కూలింగ్‌పై నియంత్రణలు ఉన్నాయి. అల్‌ఓవర్‌గా అమెరికాలో ఇది అనేక కుటుంబాలకు సహజమైన ఎంపికగా ఇటీవలి కాలంలో మారిందని అన్ స్కూలింగ్ కు పెరుగుతన్న డిమాండ్ చెబుతోంది.
అన్ స్కూలింగ్ భవిష్యత్‌ను చెడగొడుతుందా.. బాగు చేస్తుందా ?
అయిత ఈ అన్ స్కూలిగ్ విద్యార్థుల భవిష్యత్ కు ప్రమాదకరమని కొంత మంది వాదిస్తున్నారు. పాఠశాల వంటి పద్ధతుల్లో ఒక నిబంధన లేదా ప్రామాణికత ఉండదని అంటున్నారు. పిల్లలు సోషల్ గా ఇతరులతో కలవడం కష్టంగా మారుతుందన్నారు. అది అన్ని కుటుంబాలకు సరిపోయే విధానం కాదని.. అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇతర దేశాల్లోనూ అన్ స్కూలింగ్ విదానం పెరుగుతుంది. మన దేశంలో కొంత మంది సంపన్నులు తమ పిల్లలకు ఇళ్లలోనే చదువు చెప్పిస్తున్నారు కానీ తర్వాత ఏదో ఓ స్కూల్ తరపున పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
భారత్ లో ఇలాంటి విధానాలకు అవకాశం కల్పించడం కష్టమే. అయితే అమెరికా స్థాయిలో ఇక్కడ విద్యావాతావరణం ఏర్పడితే పరిశీలించవచ్చని అంటున్నారు. కానీ ప్రస్తుతం మన దేశ విద్యా విధానం.. సీబీఎస్‌ఈ వద్దనే ఉంది. ఐబీ పేరుతో కత్త విధానం తీసుకు వస్తున్నా అది చాలా ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను ఒంటరి చేయొద్దని చంపేశాడు.. కేరళ హత్య కేసుల్లో విస్తుపోయే నిజాలు





















