US Classified Documents: 21 ఏళ్ల కుర్రాడి దెబ్బకు వణికిపోతున్న అమెరికా అధ్యక్షుడు - అతనేం చేశాడంటే ?
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అధికారిక రహస్యాలను లీక్ చేశారన్న కారణంగా ఓ యువకుడ్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వదిలి పెట్టాలని అమెరికాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
US Classified Documents: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఏప్రిల్ 13న 21 ఏళ్ల జాక్ టెక్సీరా అనే యువకుడ్ని అరెస్టు చేసింది. అమెరికన్ రహస్య పత్రాలను లీక్ చేశారని జాక్ టెక్సీరాపై కేసులు పెట్టారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం నిత్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జాక్ టెక్సీరాను విడుదల చేస్తే ఆయన దేశానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం భయపడుతోంది. ఎఫ్బీఐ జాక్ టెక్సీరాను అరెస్టు చేసిన తర్వాత, అతను గేమింగ్ గ్రూప్లో క్లాసిఫైడ్ డాక్యుమెంట్ను పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అదే సమయంలో క్లాసిఫైడ్ డాక్యుమెంట్ ను కూడా ఓ చిన్న చాట్ గ్రూప్ లో షేర్ చేశాడు. అది అత్యంత తీవ్రమైన నేరంగా భావిస్తున్నారు.
జాక్ టెక్సీరాను విడుదల చేయడానికి జో బైడెన్ నిరాకరిస్తున్నారు. జాక్ టెక్సీరా యూఎస్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ గార్డ్ లో పనిచేశారు. జాక్ టెక్సీరాపై గూఢచర్యం నేరం మోపారు. జాక్.. మస్సాచుసెట్స్ 102 ఎయిర్ నేషనల్ గార్డ్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. పశ్చిమ కేప్‌కోడ్‌లోని ఒటిస్ నేషనల్ ఎయిర్‌గార్డ్స్ కార్యాలయంలో సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జాక్ పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైంది. ఇక్కడ పనిచేసేవారికి అమెరికాలోని అత్యంత రహస్య పత్రాలను చూసే అవకాశం ఉంటుంది. వీటిల్లో మ్యాప్‌లు, విశ్లేషణ పత్రాలు వంటి ఉంటాయి.అలాంటి యాక్సెస్ ఉందని వాటిని సేకరించి .. బహిరంగపరిచినట్లుగా అనుమానిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రష్యా యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని జాక్ టెక్సీరా పంచుకున్నారు. సుమారు 600 మంది ఈ గ్రూపులో ఉన్నారు. అమెరికాకు చెందిన పలు మిత్రదేశాల రహస్య సమాచారాన్ని కూడా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తన విశ్వసనీయతను కోల్పోతుందని అమెరికా భయపడిన కొంత కీలక సమాచారం కూడా ఇందులో ఉంది.
అమెరికా అధికార రహస్యాల పత్రాల్లో లభించిన సమాచారం ప్రకారం, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సమయంలో నాటో దేశాలలో పాల్గొన్న దేశాలకు చెందిన 100 ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్నాయి. బ్రిటన్ ప్రత్యేక బృందం 2021లో ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ ఇచ్చింది. రష్యాపై ఎలాంటి నిషేధం విధించడానికి సెర్బియా ఎప్పుడూ నిరాకరించలేదని మరో రహస్య రహస్య పత్రం వెల్లడించింది. ఇలాంటి తప్పిదాల వల్ల అమెరికా గూఢచారి పక్షానికి భారీ నష్టం వాటిల్లుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బైడెన్ జాక్ టెక్సీరాను విడుదల చేసేందుకు నిరాకరిస్తున్నారు.