UK Sharia: యూకే లో శరవేగంగా పెరుగుతున్న షరియా కోర్టులు, ముస్లిం జనాభా - ఇస్లామిక్ దేశంగా మారబోతోందా ?
England: యునైటెడ్ కింగ్ డమ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముస్లింలు కనిపిస్తున్నారు. అంతే కాదు వారు షరియా కోర్టులు కూడా నడుపుతున్నారు. దీంతో యూకే పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
UK will become an Islamic country: యూకేలో ఇప్పుడు పుడుతున్న పిల్లలకు అత్యధిక మంది పెడుతున్న పేరు మహమ్మద్. ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే బ్రిటన్ జనాభాలో ముస్లింల పెరుగుదల అధికంగా ఉందన్నమాట. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింలు అత్యధికంగా షరియా కోర్టులు యూకేలో నడుపుతున్నారని అంటున్నారు. యూకే చట్టాలను సైతం కాదని వారు తమ సొంత చట్టాలను అమలు చేసేసుకుంటున్నారు. అది బ్రిటన్ ప్రజల్లోనూ ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఇప్పటికి యూకేలో 85 షరియా కోర్టులు !
షరియా చట్టాన్ని అమలు చేసే కోర్టులో యూకే లో 85 ఉన్నట్లుగా తాజాగా వెలుగులోకి ఇస్లామిక్ రూలింగ్‌కు యూకే వెస్ట్రన్ క్యాపిటల్ మారుతుదని ఈ కారణంగానే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. నేషనల్ సెక్యులర్ సొసైటీ సమాంతర న్యాయ వ్యవస్థ ఉనికిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1982లో తొలి షరియా కౌన్సిల్ ఏర్పాటైంది. ఇస్లామిక్ షరియా కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్, తూర్పు లండన్ లోని లేటన్ కేంద్రంగా ఉంది . ఇది విడాకుల సమస్యలు పరిష్కరించే స్వచ్చంద సంస్థగా నమోదు అయింది. ఇంగ్లాండ్ , వేల్స్ లో నివసిస్తున్న ముస్లింలు ఈ ఇస్లామిక్ కోర్టులనే ఆశ్రయిస్తున్నారు.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
నలుగురు భార్యలకు షరియా కోర్టు ఆమోదం
షరియా చట్టం ప్రకారం నలుగురు భార్యలు ఉండవచ్చు. బ్రిటన్‌లో పెళ్లిళ్లను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలన్న నిబంధన ఉంది.అయితే బ్రిటన్ లో 1,00,000 ఇస్లామిక్ వివాహాలు నమోదు కాలేదని చెబుతున్నాయి. చాలా ముస్లిం దేశాలు షరియాను సవరించాయి. అయితే వివాహం, విడాకుల విషయంలో మాత్రం షరియా తీర్పులను అమోదిస్తున్నారు. సెక్యులరిజాన్ని ప్రోత్సహించే నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థ బ్రిటన్ లో సమాంతర న్యాయ వ్యవస్థ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందరికీ ఒకే చట్టం అనే సూత్రాన్ని దెబ్బతీసే ఇలాంటి కౌన్సిళ్లపై, మహిళలు, పిల్లల హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
యూకేలో ఇస్లామిక్ జనాభా ఆరేడు శాతం వరకూ ఉన్నారు. అయితే వీరి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ ఏడాది అత్యదిక మంతి జన్మించిన పిల్లలకు పెట్టిన పేర్లలో ముందు పేరు మహమ్మద్ ఉంటోంది. గతంలో ఇది ఇంగ్లిష్ వ్యక్తుల పేర్లుఉండేది. ఇప్పుడు ముస్లిం పేరు ముందుకు వచ్చింది. ఇది పెరుగుతున్న ముస్లింజనాభాకు సంకేతమని అంటున్నారు. ఇప్పటికే యూకేలో ముస్లింల ప్రభావం పెరిగిపోయింది. మరో ఐదు దశాబ్దాల్లో యూకే ఇస్లామిక్ మెజార్టీ కంట్రీగా మారవచ్చని ఆందోళన చెందేవారి సంఖ్య పెరుగుతోంది.