అన్వేషించండి

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

ఇప్పటి వరకూ లావెక్కింది చాలు… తగ్గండి బాబు తగ్గండి. ఊరికే తగ్గనవసరం లేదు…అందుకోసం ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటున్నారు. ఇదేం ఆఫర్.... ఎక్కడేంటి అంటారా…చూసేయండి మరి….

ఉరకల పరుగుల జీవనంలో సమయం చూసుకునే సమయం కూడా లేనంత బిజీగా పరుగులు పెట్టేవారిని… ఎంచక్కా ఇంట్లో కూర్చోబెట్టింది కరోనా. ఇంకేముంది హాయిగా తినడం, కూర్చోవడం…మరో పనిలేదు. పోనీ వ్యాయామానికి బయటకు వెళదాం అంటే కరోనా భయమాయే. అందుకే అప్పటి వరకూ టైమ్ చూసుకునే టైమ్ లేనివాళ్లంతా… టైమ్ చూసుకునే అవసరమే లేదన్నారు. ఎప్పుడంటే అప్పుడు నిద్ర, ఎప్పుడు లేస్తే అప్పుడు తిండి…. ఇక వర్క్ ఫ్రం హోం లు చేసేవారంతా తినడం, కదలకుండా సిస్టమ్ ముందు కూర్చోవడం. ఇలా చేస్తే బరువు  పెరగక…తగ్గుతారా?

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో 41 శాతం మంది తాము లావయ్యామని అంగీకరించారు. సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌’ అంచనా వేసింది. కరోనా కల్లోలం సృష్టిస్తోంది…దీనికి తోడు బరువు పెరిగి మరికొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారనే ఆలోచనతో యూకే ప్రభుత్వం సన్నద్ధమైంది. పౌరులంతా సన్నబడాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌హెచ్‌ఎస్ సిద్ధమైంది.

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

ఎన్‌హెచ్‌ఎస్ ఏం చేస్తోందంటే

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించడం మాత్రమే కాదు… టీవీల్లో జంక్‌ ఫుడ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై నియంత్రణ విధించింది. ఆహార పదార్థాల్లో ఉండే కెలోరీల వివరాల్ని అందరికీ తెలియజేసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు చేపడుతోంది. జంక్‌ ఫుడ్‌లపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రణాళికలను ఎన్‌హెచ్‌ఎస్ ప్రోత్సహిస్తోంది. అలాగే బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన ప్రకటనలను టీవీల్లో ఇస్తోంది.

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

బరువు తగ్గితే ప్రోత్సాహకాలు

బ్రిటన్‌ పౌరుల్లో ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారో వారికి నగదు ప్రోత్సాహకాలు, బోనస్‌లు, డిస్కౌంట్‌ కూపన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. జంక్‌ఫుడ్‌ తినడం మానేసి, ఎక్కువ కూరగాయలు, పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారట. ఊబకాయంపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరీస్‌ జాన్సన్‌ సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు.

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

ప్రత్యేక యాప్

ఈ ప్రోత్సాహకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా సూపర్‌ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్ల లెక్కలను విశ్లేషించనున్నారు. ఎవరైతే జంక్‌ఫుడ్‌ను తగ్గించి.. కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారిని గుర్తించి యాప్‌ ద్వారానే లాయల్టీ పాయింట్లు ఇస్తారు. విద్యాసంస్థలకు, ఆఫీసులకు వాహనాల్లో కాకుండా కాలినడక వెళితే అదనంగా మరిన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్‌బ్యాక్‌ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్‌.. ఫ్రీ టికెట్స్‌ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుకు, యాప్‌ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

UK Promotes Healthy Life:తగ్గేదే లే అంటే కుదరదు…తగ్గాల్సిందే….

దుబాయ్ లో ఇప్పటికే ఉంది

ఇలాంటి కార్యక్రమమే దుబాయ్‌లో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.

ప్రజారోగ్యం పట్ల ఆయా ప్రభుత్వాలకి ఎంత శ్రద్ధ ఉందో ఈ కార్యక్రమాల ద్వారా తెలుస్తున్నాయంటున్నారంతా. మరి భవిష్యత్ లో వీరిని ఏ ప్రభుత్వాలైనా అనుసరిస్తాయేమో చూడాలి…..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget