Two Planes Collide: రన్‌వేపై ఢీకొట్టుకున్న విమానాలు, విరిగిపోయిన రెక్కలు - తృటిలో తప్పిన ప్రమాదం
Two Planes Collide: టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి.
Two Planes Collide:
టోక్యోలో ఘటన..
టోక్యోలోని హనడా ఎయిర్‌పోర్ట్‌లో వింత ఘటన జరిగింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీ కొట్టుకున్నాయి. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఒకేసారి రెండు విమానాలు రన్‌వేపైకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాకపోతే...చాలా సేపటి వరకూ ఫ్లైట్ సర్వీస్‌లకు అంతరాయం కలిగింది. దాదాపు నాలుగు రన్‌వేలను మూసేసింది ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. Eva Airwaysకి చెందిన ఓ విమానం...థాయ్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌ని ఢీకొట్టినట్టు లోకల్ మీడియా రిపోర్ట్ చేసింది. ఈ ప్రమాదంలో థాయ్ ఎయిర్‌వేస్ విమానం రెక్కలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న రన్‌వేపై పడిపోయాయి. బ్యాంకాక్‌కి చెందిన ట్యాక్సీవేలో ఉంది. టేకాఫ్‌కి రెడీగా ఉన్న సమయంలో కుడి రెక్క అటు పక్కనే ఉన్న ఎవా ఎయిర్‌క్రాఫ్ట్‌కి తగిలింది. అక్కడికక్కడే విరిగిపోయింది. ఫలితంగా..టేకాఫ్‌కి అంతరాయం కలిగింది. అయితే..దీనిపై రెండు ఎయిర్ లైన్స్ సంస్థలు స్పందించలేదు. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 250 మంది ప్రయాణికులున్నారు. 14 మంది సిబ్బంది కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ప్లేన్ క్రాష్ మిస్టరీ...
47 ఏళ్ల క్రితం మలేషియాలో ఓ విమాన ప్రమాదం (Malaysia Nomad Plane Crash) జరిగింది. పలువురు రాజకీయ నాయకుల ప్రాణాలు బలి తీసుకుంది ఈ ఘటన. ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనమైంది. కానీ...అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది.? అన్నది మాత్రం ఇప్పటికీ ఓ అంతు పట్టని మిస్టరీగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఈ మిస్టరీ వీడింది. ఆ ప్రమాదం జరగడానికి కారణమేంటో మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. 1976లో జరిగిన ప్లేన్ క్రాష్‌పై రిపోర్ట్ తయారు చేసింది. విమానంలోని ఆస్ట్రేలియా తయారు చేసిన టర్బైన్ ఇంజిన్‌ని ప్రాపర్‌గా లోడ్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఫలితంగా...పైలట్ ఫ్లైట్‌పై కంట్రోల్ కోల్పోయాడని వెల్లడించింది. ఎయిర్ క్రాఫ్ట్ మాల్‌ఫంక్షన్ కానీ, అగ్ని ప్రమాదం కానీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. Nomad Planeని గవర్నమెంట్ ఎయిర్‌క్రాప్ట్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా తయారు చేసింది. టర్బైన్ ఇంజిన్ సరిగ్గా లోడ్ అవకపోవడం వల్ల ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్‌లో 10 మంది ఉన్నారు. పైలట్‌తోపాటు వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దీనిపై 21 పేజీల రిపోర్ట్ తయారు చేసింది మలేషియా. 1976లో జూన్ 6వ తేదీన ఈ ప్రమాదం జరిగింది.అందుకే...ఈ ఘటన Double Six (06-06-1976)గా పాపులర్ అయింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, హౌజింగ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్‌తో పాటు మరి కొందరు కీలక నాయకులు ఈ ప్రమాదంలో చనిపోయారు. 1977 జనవరి 25వ తేదీనే క్రాష్ రిపోర్ట్ తయారైంది. కానీ ఇన్నిరోజుల పాటు అది వెలుగులోకి ఎందుకు తీసుకురాలేదన్నది మాత్రం మలేషియా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు.
Also Read: International Yoga Day: యోగా రాజకీయాలు షురూ, బీజేపీకి పోటీగా ఆప్ వేడుకలు