World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Safest Countries : రెండు ప్రపంచ యుద్దాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఆ యుద్ధాలను చూసిన వారు ఇప్పుడు దాదాపుగా ఎవరూ లేరు. కనీ ఇప్పటి తరానికి మూడో ప్రపంచయుద్ధం చూడాల్సిన పరిస్థితి వస్తోంది.
The Safest Countries To Be In If World War III Breaks Out : ప్రపంచం అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంలోకి వెళ్లిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోతలు ఇంకా అలాగే ఉండగానే.. పశ్చిమాసియా రలిగిపోతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా ,గాజా ఇలా ఇంతకంతకూ యుద్ధం విస్తరించుకుంటూ పోతోంది. ఇది ప్రపంచదేశాలనుప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ , ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్ విషయంలో అమెరికా సీరియస్ గా ఉంది.
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతూ ఉంది. ఉక్రెయిన్ కు భారీ ఆయుధాలు ఇవ్వాలని కొత్త బ్రిటన్ ప్రధాని నిర్ణయించారు. తమ దేశంపై దాడిచేసేందుకు ఆయుధాలను ఉక్రెయిన్ కు ఎవరైనా ఇస్తే.. ఆ దేశాలు తమపై దాడి చేసినట్లుగా భావించి అణుబాంబులు వేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అమెరికా, బ్రిటన్ లపై అణుబాంబులు ఎన్ని కావాలంటే అన్ని వేయగల సామర్థ్యం రష్యాకు ఉంది. ఇలా మొత్తం దేశాల మధ్య ఏర్పడుతున్న యుద్ధాలు. ఆయాదేశాలతోనే ఆగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మరి మూడో ప్రపంచయుద్ధం వస్తే .. ఏ దేశం సురక్షితంగా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దానికి కొన్ని సమాధానాలు ఉన్నాయి.
భారత్‌కూ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అవసరమే - ఎయిర్ చీఫ్ మార్షన్ కీలక వ్యాఖ్యలు
యుద్ధం వచ్చినా సేఫ్‌గా ఉండే ప్రాంతాల్లో అంటార్కిటికా మొదటిది. యుద్ధం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా హాయిగా ఉండవచ్చు. కానీ అక్కడ జీవనం అంటే వాతావరణ పరిస్థితులతో యుద్ధం చేయడమే. అందుకే అక్కడ బతకడానికి పెద్దగా అనువు కాదు. ఇక రెండో దేశం .. అర్జెంటీనా. ఈ దేశం మొత్తం గోధుమ పంటలతో ఉంటుంది. అక్కడ అణుబాంబులు పడినా వాటి ప్రభావం స్వల్పంగా ఉంటంది. అందకే సేఫ్ ప్లేసుల్లో అర్జెంటీనా రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో అణుబాంబులు వేయడానికి అందనంత దూరంలో అర్జెంటీనా ఉంది.
భూటాన్ కూడా సేఫ్ ప్లేస్ గా రక్షణ నిపుణులు నిర్ధారించారు. పూర్తిగా పర్వతాల్లో ఈ దేశం ఉంటుంది. ఆ తర్వాత దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ, ఫిజి దేశాలు వాటికి ఉన్న భౌగోళిక అనుకూలతల వల్ల సేఫ్ ప్లేసులుగా ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, ఇండోనేషియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ హాయిగాబతకవచ్చు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ దేశాలు హాయిగా ఉంటాయి. ఎందుకంటే ఎవరితోనూ ఈ దేశాలు గొడవలు పెట్టుకోలేదు. ఎవరికీ టార్గెట్ కాలేదు. స్విట్జర్లాండ్, తువాలు దేశాల్లోనూ యుద్ధం నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అనుకుంటే.. ఈ పది దేశాలకు వీసాలు, పాస్ పోర్టులు రెడీ చేసుకుంటే ... వెంటనే ఫ్లైట్ ఎక్కేయవచ్చు.