X

Talking Duck : బాలకృష్ణ మాస్ డైలాగుల్ని చెబుతున్న ఆస్ట్రేలియా బాతు ! ఇప్పుడది వరల్డ్ ఫేమస్ తెలుసా..?

మాట్లాడే చిలుకల్ని ఇప్పటి వరకూ చూసి ఉంటారు. కానీ మాట్లాడే బాతు మొదటి సారిగా ఆస్ట్రేలియాలో కనిపించింది. అది మొదటగా నేర్చుకున్న మాట " యూ బ్లడీ ఫూల్"

FOLLOW US: 

" యూ బ్లడీ ఫూల్"  అని గట్టిగా వినిపిస్తే ఏదో బాలకృష్ణ సినిమా డైలాగేమో అని కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మాటను ఇప్పుడు మనుషులే కాదు ఓ బాతు కూడా చెబుతోంది. ఆస్ట్రేలియాలో ఓ జూలో  జంతువుల్ని చూడటానికి ఓ పరిశోధకుడు వెళ్తాడు. అలా వెళ్లినప్పుడు అతనికి " యూ బ్లడీ ఫూల్"  డైలాగ్ తరచూ వినిపించింది. ముఖ్యంగా ఓ కొలను దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ మాటలు వినిపించాయి . ఎవరైనా తనను తిడుతున్నారా అని అంతా అంతా తరచి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు.  కానీ సీక్రెట్ ఏమిటో కనిపెటాల్సిందేనని ఆ వాయిస్‌లను రికార్డు చేసి మరీ పరిశోధన చేశాడు. చివరికి తేలిందేమిటంటే అలా " యూ బ్లడీ ఫూల్"  అని తిడుతున్నది ఓ  బాతు. Also Read : సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అవడానికి కారణం ఏమిటి..?

చిలుకలు ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాయని ఇప్పటి వరకూ తెలుసు కానీ బాతులు కూడా మాట్లాడతాయా.. అదీ కూడా " యూ బ్లడీ ఫూల్"  వంటి బూతులు మాట్లాడతాయా అని ఆ పరిశోధకుడు ఆశ్చర్యపోయి.. మరింత సమాచారం సేకరించారు. ఆ బాతుకు జూ అధికారులు రిప్పర్ అని పేరు పెట్టారు. అంతకు ముందు రిప్పర్‌ను చూసుకునేందుకు ఓ కేర్ టేకర్‌ను పెట్టారు. ఆ కేర్ టేకర్ కావాలని నేర్పాడో లేకపోతే అతను సందర్శకుల్ని " యూ బ్లడీ ఫూల్"   అనితరచూ తిట్టేవడో కానీ రిప్పర్ ఆ పదాన్ని నేర్చేసుకుంది. మెల్లగా తన భాషలో క్వాక్..క్వాక్ అనాల్సింది పపోయి.." యూ బ్లడీ ఫూల్"  అనడం ప్రారంభించింది. అదే దాని లాంగ్వేజ్ అయిపోయినట్లుగా గుర్తించారు. Also Read : ఉద్యోగికి ఓ గంట పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు.. సీన్ కట్‌ చేస్తే రూ.2 కోట్లకు బ్యాండ్‌..

రిప్పర్ బాతు బూతులను వినేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో  లైడెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసశారు. రిప్పర్ జాతి బాతులకు మనుషుల మాటలను అనుకరించే శక్తి ఉంటుందని వారు తేల్చారు. ఈ విషయాన్ని కొన్ని జర్నల్స్‌లోనూ ప్రచురించారు.  బాతు " యూ బ్లడీ ఫూల్"  అన్న వాయిస్ విని అది ఫేక్ అని అనుకున్నానని.. సజీవ పక్షి శాస్త్రవేత్త పీటర్ అనుకున్నారు. కానీ అవి నిజమేనని ఆయన కూడా తరవాత క్లారిటీకి వచ్చారు. Also Read : ఓరినీ.. ఇదేం పైత్యం.. విమానానికి తాడు కట్టి ఊయల ఊగడమేంటయ్యా తాలిబన్స్

కొన్ని జాతుల జంతువులు, ముఖ్యంగా చిలుకలు లాంటి పక్షులు మనుషుల మాటల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ బాతులు తక్కువ.  బాతుల్లో అసాధారణమైన విషయం కాబట్టి ఇప్పుడా రిప్పర్ ప్రపంచ సెలబ్రిటీ అయిపోయింది. తెలుగువారికిఆ " యూ బ్లడీ ఫూల్"   డైలాగ్ ఇప్పటికే బాలకృష్ణ చెప్పి ఉండటంతో మరింత వైరల్ అవుతోంది. 

Also Read : వీడెవడండి బాబు.. ఏకంగా ఫోన్ మింగేశాడు, చివరికి ఇలా బయటకొచ్చింది!

Tags: talking duck You bloody fool Ripper Ducky hear ducky do

సంబంధిత కథనాలు

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!

Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

India China Standoff: డ్రాగన్ వంకర బుద్ధి.. అమల్లోకి కొత్త సరిహద్దు చట్టం.. భారత్‌పై ఎఫెక్ట్!

India China Standoff: డ్రాగన్ వంకర బుద్ధి.. అమల్లోకి కొత్త సరిహద్దు చట్టం.. భారత్‌పై ఎఫెక్ట్!

UN Investigator: ఉత్తర కొరియాకు పెద్ద కష్టం.. ఆహార కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు.. అలా ఎప్పుడూ లేదు

UN Investigator: ఉత్తర కొరియాకు పెద్ద కష్టం.. ఆహార కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు.. అలా ఎప్పుడూ లేదు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!