News
News
X

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

ఎక్కడ సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుందో అక్కడ తప్పక మార్గం ఉంటుందనే ఓ మాటను వినే ఉంటారు కదా.. దాన్నే చేసి చూపిస్తున్నాడు ఓ లెక్కల మష్టారు.

FOLLOW US: 

పరిస్థితులు మారాయి. ఇప్పుడంతా ఆన్ లైన్ చదువులు. ఉపాధ్యాయులూ అప్ డేట్ అయిపోయారు. పిల్లలకు పాఠాలు  చేరేలా యూ ట్యూబ్ ఛానళ్లతో విద్యార్థుల దగ్గరకు వెళ్తున్నారు. కానీ ఓ ఉపాధ్యాయుడు లెక్కల పాఠాలు చెప్పేందుకు మాత్రం.. డిఫరెంట్ స్టైల్ ని ఎంచుకున్నాడు. అలాంటి.. ఇలాంటి ఆలోచన కాదది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే.. పోర్న్ హబ్ సైట్ లో తన లెక్కల పాఠాలు చెబుతున్నాడు. అక్కడ పాఠాలు చెబితే ఎవరు చూస్తారనే కదా మీ డౌటనుమానం. అంత లేదండి.. పోర్న్ హబ్ లో పాఠాలు చెబుతూ.. వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఈ మాష్టారుకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది?

తైవాన్ కు కు చెందిన చాంగ్షు అనే ఉపాధ్యాయుడు పోర్న్ హబ్ లో లెక్కల పాఠాలు చెబుతున్నాడు. ఇప్పటి వరకు అడల్ట్ కంటెంట్ లేని.. 200 వీడియోలు అప్ లోడ్ చేశాడు. గణితం పాఠాలైనా.. జనాలు ఎక్కువగానే చూస్తున్నారు. గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు చాంగ్షు. 15 ఏళ్లుగా తైవాన్ పాఠశాలలు, ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నాడు. కొన్ని రోజులు తన లెక్కల పాఠాలను యూట్యూబ్ లో కూడా బొధించాడు. అయితే తాను చెప్పే గణితం పాఠాలను విస్తరించాలనుకున్నాడు. ఎలా అని తెగ ఆలోచించాడు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే పోర్న్ హబ్ సైట్ అతడికి కనిపించింది. దానిపైనే పాఠాలు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. 

మెుదట పోర్న్ హబ్ లో కొన్ని పాఠాలు అప్ లోడ్ చేశాడు చాంగ్షు. రివ్యూలు మంచిగా రావడంతో ఇక కంటిన్యూ చేశాడు. 'changhsumath666' పేరుతో పోర్న్ హబ్ లో తన ఖాతా రిజిస్ట్రర్ అయి కూడా ఉంది. 'అడల్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తక్కువ మంది గణితాన్ని బోధిస్తారు. వాటిలో వీడియోలను చూసే వారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను నా వీడియోలను అక్కడ అప్‌లోడ్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది.. ప్రజలు వాటిని చూస్తారు.' అనుకున్నాని చెబుతున్నాడు చాంగ్షు. XVideos. NXNN వంటి ఇతర అడల్ట్ వెబ్‌సైట్‌లకు పోస్ట్ చేసి.. తన గణిత పాఠాలను మరింత విస్తరించాలనుకున్నాడు. అయితే ఆ ప్లాట్‌ఫారమ్‌లు ఈ పాఠాల వీడియోలను అనుమతించలేదు. 

దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ మంది వీక్షకులు తన వీడియోలను ఆ సైట్ లో కామెడీగా చూస్తారేమోనని చాంగ్షు అభిప్రాయపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ తన వీడియోలపై ఆసక్తి చూపకపోవచ్చు అని చెబుతున్నాడు. పోర్న్ హబ్ లో గణితం చెప్పే టీచర్ ఉన్నాడని.. ఆ సైట్ కి వచ్చే చాలా మందికి తెలుసు అని అంటున్నాడు. పోర్న్ హబ్ లో పాఠాలు చెప్పడం ద్వారా..ఏడాదికి  250,000 డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు తెలిపాడు. వచ్చిన ఆదాయాన్ని.. వేరే ప్లాట్ ఫారమ్స్ లో తనకు పాఠాలు బొధించేందుకు సహాయ పడేవారికి చెల్లిస్తాడట. మిగిలినవి తన ఖర్చులకు ఉపయోగించుకుంటానని చాంగ్షు అంటున్నాడు.

'పోర్న్ హబ్ లో పాఠాలు బొధించడం నాకు ఇష్టం లేదు. చాలా మంది విద్యార్థులు అక్కడ నా కోర్సులను కొనుగోలు చేస్తారు. గణితం బాగా చెప్పే.. తైవాన్ ఉపాధ్యాయుడని ప్రపంచానికి తెలియాలని నా కోరిక.' అంటున్నాడు చాంగ్షు.

Also Read: Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Also Read: Migraine Pain: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Oct 2021 10:53 AM (IST) Tags: porn hub teacher lessons in porn hub Taiwan teacher Maths Teacher porn hub lessons

సంబంధిత కథనాలు

Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Iran Anti Hijab Protest: యాంటీ హిజాబ్ నిరసనల్లో శివంగిలా దూకిన యువతి దారుణ హత్య, శరీరంలో 6 బులెట్లు

Iran Anti Hijab Protest: యాంటీ హిజాబ్ నిరసనల్లో శివంగిలా దూకిన యువతి దారుణ హత్య, శరీరంలో 6 బులెట్లు

Hurricane Ian: రిపోర్టింగ్ చేస్తూనే కింద పడిపోయాడు, ఫ్లోరిడాలో హరికేన్ బీభత్సం

Hurricane Ian: రిపోర్టింగ్ చేస్తూనే కింద పడిపోయాడు, ఫ్లోరిడాలో హరికేన్ బీభత్సం

Indians US visa: దయచేసి ఓపిక పట్టండి, వీసాల సమస్య పరిష్కరిస్తాం - అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్రకటన

Indians US visa: దయచేసి ఓపిక పట్టండి, వీసాల సమస్య పరిష్కరిస్తాం - అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్రకటన

China Restaurant Fire: రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు- ప్రమాదంలో 17 మంది మృతి!

China Restaurant Fire: రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు- ప్రమాదంలో 17 మంది మృతి!

టాప్ స్టోరీస్

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?