By: ABP Desam | Updated at : 29 Dec 2021 12:16 PM (IST)
తాలిబన్ల అరాచకం (Photo: Twitter/@TajudenSoroush)
Taliban Torturing Former Afghan army official: ఈ ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆపై అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు సైతం అఫ్ఘాన్ నుంచి ఉపసంహరించుకున్న అనంతరం తాలిబన్లు చెలరేగిపోతున్నారు. 20 ఏళ్ల అనంతరం తిరిగి దేశాన్ని తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. గతానికి భిన్నంగా పాలన సాగిస్తామని సైతం ప్రకటనలు చేశారు. దేశ అధ్యక్షుడు విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. భారత్, అమెరికా సైన్యాలు అఫ్ఘాన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు తరలించారు.
తాలిబన్లు అరెస్టు చేసిన మాజీ ప్రభుత్వ సైనిక అధికారిని ఇద్దరు వ్యక్తులు హింసించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఫ్ఘాన్‌కు చెందిన ఓ ప్రతినిధి తాజుదీన్ సోరౌష్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. తాలిబన్లు ఓ మాజీ సైనికుడు రహ్మతుల్లా ఖదేరిని చిత్రహింసలకు గురిచేశారు. గత వారం రహ్మతుల్లాను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇస్లామిక్ ఎమిరేట్ సేనలు అధికారంలోకి వచ్చిన తరువాత సాధారణ క్షమాభిక్షను ప్రసాదించే వారు. కానీ ఇందుకు భిన్నంగా తాజాగా తాలిబన్లు చిత్రహింసలకు గురిచేస్తూ బాధితుల వీడియోలను సైతం విడుదల చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని టోలో న్యూస్ రిపోర్ట్ చేసింది.
Taliban tortures former army official Rahamatullah Qaderi. Qaderi was arrested last week. pic.twitter.com/5slH5tQs72
— Tajuden Soroush (@TajudenSoroush) December 27, 2021
ఈ ఘటనపై యూనివర్సిటీ లెక్చరర్ హెక్మతుల్లా మిర్జాదా మాట్లాడుతూ.. గతంలో సాధారణ క్షమాభిక్షను ప్రకటించారు. కొన్ని సందర్భాలలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. చిన్న శిక్షలతో వదిలిపెడుతున్నారని చెప్పారు. మాజీ సైనిక అధికారి రహ్మతుల్లా అందర్ సైతం తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలలో తమపై విశ్వాసం పెరుగుతుందని తాలిబన్లు భావిస్తున్నారని చెప్పారు. ప్రావిన్షియల్ గవర్నర్‌లు, భద్రతా విభాగాల అధిపతుల ద్వారా శిక్షలు అమలు కావాలని ఆకాంక్షించారు.
వ్యక్తిగత ప్రతీకారాలు పక్కనపెట్టాలని, ప్రజలను సాధారణ క్షమాపణ, చిన్న చిన్న శిక్షలు విధించాలని తాలిబాన్ యొక్క అగ్ర నేతలలో ఒకరైన అనాస్ హక్కానీ చెప్పినట్లు టోలో న్యూస్ రిపోర్ట్ చేసింది. గతంలో ప్రజలను, మాజీ అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా శిక్షించినట్లు కథనాలు రావడాన్ని ఖండించారు. మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సంస్థలు తమపై దుష్ప్రచారం చేశాయన్నారు. గత ప్రభుత్వంలో సంబంధాలు ఉన్న వ్యక్తులను హింసించడం ద్వారా ప్రజలలో తమపై నమ్మకం పోతుందని.. దీని కారణంగా భవిష్యత్తులో అశాంతి నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుడు సయ్యద్ బాకీర్ మోసిన్ అభిప్రాయపడ్డారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
Also Read: New Study: కోపం, అసహనం పెరిగిపోతోందా? మీరు తినే ఆహారం కూడా వాటికి కారణమే
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Australia Elections: ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్ పరిపాలనకు తెర- కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!
PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
In Pics : దావోస్ లో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ భేటీ