Sri Lanka Economic Crisis: సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా- విపక్షాలకు అధ్యక్షుడి బంపర్ ఆఫర్
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. దీంతో తమ మంత్రివర్గంలో చేరాలని విపక్షాలకు అధ్యక్షుడు గొటబయా రాజపక్స పిలుపునిచ్చారు
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరింది. తాజాగా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను మంత్రులు అందించారు. ఆర్థిక, ఆహార సంక్షోభం కారణంగా మార్చి 31 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు అధ్యక్షుడు రాజపక్స.
వార్తలు అవాస్తవం
దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ప్రధాని కార్యాలయం కొట్టిపారేసింది. మహీందా రాజపక్స రాజీనామా చేయలేదని కార్యాలయం స్పష్టం చేసింది. అవి తప్పుడు వార్తలుగా పేర్కొంది.
విపక్షాలకు ఆఫర్
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు తమ మంత్రిత్వ శాఖలో చేరాలని కోరారు. తద్వారా సంక్షోభానికి పరిష్కరానికి దిశగా అడుగులు వేద్దామన్నారు. దేశ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సను పదవిలో నుంచి తొలగించారు అధ్యక్షుడు గొటబయా. సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.
ఎందుకిలా?
ఆర్థిక మాంద్యం, శ్రీలంక కరెన్సీ క్షీణత వల్ల దేశంలో ధరల పెరుగుదల సంభవించింది. ఒకవేళ ధర చెల్లించి కొనుక్కుందామన్నా కొన్ని చోట్ల సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది. చాలామంది షాపులు, సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరి, చివరకు సరుకులు అయిపోయి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Also Read: Sri Lanka PM Resigns: ప్రధాని రాజపక్సా రాజీనామా చేయలేదు - క్లారిటీ ఇచ్చిన పీఎంవో