Sri Lanka Crisis: శ్రీలంకలో అలా కనిపిస్తే కాల్చివేత - ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ !
ఆస్తులు లూటీ చేస్తూ కనిపించినా... ఎవరిపైనేనా దాడి చేస్తున్నా... కాల్చి పడేయాలని ఆర్మీకి శ్రీలంక రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Sri Lanka Crisis: శ్రీలంక రక్షణ శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీని దోచుకునేందుకు ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని సైన్యానికి ( Army ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఎవరైనా ఇతరులపై దాడి చేయడం.. హాని చేయడం వంటి వాటికి పాల్పడుతున్న అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ఆహార సంక్షోభం కూడా ఏర్పడింది. నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. విదేశీ మారకద్రవ్యం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో దిగుమతులు చేసుకోలేకపోతున్నారు. దీంతో ఎక్కడిక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. లూటీలు జరుగుతున్నాయి. ఇలాంటి అల్లర్లలో గాయపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
నిరసనకారుల 'లంకా దహనం'- రహస్య ప్రాంతానికి పారిపోయిన మాజీ ప్రధాని!
ఇప్పటికే అల్లర్ల ధాటికి మహిందా రాజపక్సే ( Rajapakse ) కుటుంబాన్ని నేవీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. రాజపక్స నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. చివరికి ఆయననురక్షించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
శ్రీలంకలో కొనసాగుతున్న హింసాకాండ! ప్రధాన మంత్రి ఇంటికి నిప్పు, అధ్యక్షుడి ఇంటి ముందూ నిరసనలు
ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో ఉండటంతో రాజకీయ నేతలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నా విపక్షాలు కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార నివాసాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
రగులుతున్న శ్రీలంక- నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి
పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి అల్లర్లకు పాల్పడినా.. ప్రభుత్వ , ప్రజల ఆస్తులపై లూటీలకు పాల్పడినా కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చారు. వీటితో అయినా అల్లర్లు ఆగుతాయో లేదో కానీ పెద్ద ఎత్తున సామాన్యులు మాత్రం చనిపోతున్నారు. శ్రీలంక సమస్యకు పరిష్కారం దొరకాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.