అన్వేషించండి

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై 2 నెలల క్రితం హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి తెలిపారు.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందట. అయితే దీని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందన్నారు.

" నల్ల సముద్రం, కాస్పియన్‌ సముద్రం మధ్య ఉండే కాకసస్‌ రీజియన్‌లో పుతిన్ పర్యటించిన సమయంలో అక్కడి ప్రతినిధులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించారు. అయితే ఆ హత్యాయత్నం విఫలమైంది. ఈ ఘటన బయటి ప్రపంచానికి తెలియకూడదని రష్యా రహస్యంగా ఉంచింది. పుతిన్‌కు త్వరలోనే తిరుగుబాటు ఎదురుకానుంది. రష్యాలో మొదలయ్యే ఈ తిరుగుబాటు ఆయన పదవిని కూడా పోగొడుతుంది. ఎంతో మంది నియంతల్లానే పుతిన్ కూడా ఘోరంగా దెబ్బతింటారు. పుతిన్‌కు ఎన్నో రోగాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ను 3 రోజుల్లో స్వాధీనం చేసుకోవాలని పుతిన్ కలలు కన్నారు. ఇది నెరవేరకపోయేసరికి మానసికంగా కుంగిపోయారు.                                                 "
-కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి

అయితే తనపై ఐదుసార్లు హత్యాయత్నాలు జరిగినట్టు 2017లో స్వయంగా పుతిన్ ఓ సందర్భంలో అన్నారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 నెలలు పూర్తయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో పుతిన్ రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్‌లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్‌ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నారు. అయినా ఉక్రెయిన్‌ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది.

యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్‌డొనాల్డ్స్‌ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ రష్యాను ఒక్కొక్కటిగా విడిచివెళ్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్‌ కూడా అంగీకరించారు.

రష్యాకు నష్టం

ఈ సైనిక చర్య కారణంగా రష్యా.. అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని యత్నించిన పుతిన్ సేనలకు ఉక్రెయిన్ చుక్కలు చూపించింది. పాశ్చాత్య దేశాల దన్నుతో ఉక్రెయిన్‌ ఇప్పటికీ దీటుగా పోరాడుతోంది. దీంతో పుతిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?

Also Read: Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget