By: Ram Manohar | Updated at : 24 Sep 2023 05:58 PM (IST)
ఉక్రెయిన్‌లో అమెరికా భారీ పెట్టుబడులు పెట్టనుందని జెలెన్‌స్కీ ప్రకటించారు.(Image Credits: AP)
Russia-Ukraine War:
జెలెన్‌స్కీ అమెరికా పర్యటన..
ఉక్రెయిన్‌కి మొదటి నుంచి మద్దతునిస్తూ వస్తోంది అగ్రరాజ్యం. రష్యా సైనిక చర్యని తీవ్రంగా ఖండిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చాలా సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా పర్యటనకు వచ్చిన జెలెన్‌స్కీ అక్కడి ఫైనాన్షియర్‌లు, బడా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రష్యా యుద్ధం కారణంగా ధ్వంసమైన దేశాన్ని మళ్లీ నిర్మించుకునేందుకు తంటాలు పడుతున్నారు జెలెన్‌స్కీ. ఈ విషయంలో అమెరికా సాయం తీసుకుంటున్నారు. పెట్టుబడులు భారీగానే వెల్లువెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"అమెరికాలోని బడా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యాను. అందరూ ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మా దేశాన్ని రీబిల్డ్ చేసుకునేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బహుశా భారీగానే పెట్టుబడులు వస్తుండొచ్చు. కాకపోతే యుద్ధం ముగిసిన తరవాతే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లు తరలి వస్తాయి. ఈ యుద్ధంలో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం"
- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
కెనడాలోనూ పర్యటన..
అమెరికాతో పాటు కెనడాలోనూ పర్యటించారు జెలెన్‌స్కీ. రెండు దేశాల సహకారం కోరారు. మిలిటరీ సహకారంతో పాటు ఆర్థిక సాయం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 19 నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. చర్చలకు సిద్ధమే అని రష్యా పైకి చెబుతున్నా...సైనిక చర్య మాత్రం ఆపడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
In Toronto, @JustinTrudeau and I met with Canadian business leaders.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 23, 2023
I told them that we would be interested in having them work in Ukraine, including actively participating in recovery.
We also talked about ways to increase investment and steps to facilitate it during wartime. pic.twitter.com/Q3J3LyrZNr
రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు..
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో పెద్ద చర్చే జరిగింది. రష్యాది కచ్చితంగా ఆక్రమణే అని పశ్చిమ దేశాలన్నీ గట్టిగానే వాదించాయి. రష్యాకి మద్దతుగా ఉన్న చైనా, ఇటలీ మాత్రం ఉక్రెయిన్నే నిందించాయి. డిక్లరేషన్‌లోనూ ఈ అంశంపై ముందు ఏకాభిప్రాయం రాలేదు. ఆ తరవాత భారత్ చొరవ తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త డిక్లరేషన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కానీ అన్ని దేశాలూ దానికి ఆమోద ముద్ర వేయలేదు. ఈ పరిణామాల మధ్య G20 సదస్సుకి హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ (Sergey Lavrov) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉక్రెయిన్ చేజేతులా తన దేశాన్ని నాశనం చేసుకుందని తేల్చి చెప్పారు. పశ్చిమ దేశాలకూ ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుందని సెటైర్లు వేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోతాయా అని మీడియా ప్రశ్నించగా...అందరం శాంతి వాతావరణం నెలకొల్పేందుకే ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు సెర్గే లవ్రోవ్. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే అని పుతిన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్లు ఖాళీ, ఇవి నిండాలంటే మరో 300 కోట్ల జనాభా కావాలట - చైనాకి కొత్త తలనొప్పి
Massive Solar Storms: సౌరవ్యవస్థలో తుఫాన్‌లు, భవిష్యత్తులో ఇంటర్నెట్, జీపీఎస్ పనిచేయవట
Gaza: ఇంకొన్ని రోజులు ప్లీజ్, సంధి పొడిగించాలని కోరుతున్న హమాస్
PM Modi in Dubai: దుబాయ్‌లో ప్రధాని మోడీ-ఘనంగా స్వాగతం పలికిన భారతీయులు
ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం
Gaza: ఇజ్రాయేల్ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>