Russia Luna 25 Crashed on Moon: 47 ఏళ్ల రష్యా కల చంద్రుడిపై కూలిపోయింది! లూనా 25 క్రాష్ సొంత తప్పిదమా!
Reasons For Russia Luna 25 Crashed on Moon: చంద్రుడిపై లూనా25 క్రాష్ ల్యాండ్ అయిందన్న రష్యా అంతరిక్ష ప్రయోగ సంస్థ రాస్ కాస్మోస్. 47 ఏళ్ల నిరీక్షణ తర్వాత సైతం రష్యాకు ఫలితం దక్కలేదు.
Reasons For Russia Luna 25 Crashed on Moon:
రష్యన్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. లూనా25 క్రాష్ ల్యాండ్ అయిందన్న రష్యా అంతరిక్ష ప్రయోగ సంస్థ రాస్ కాస్మోస్. 47 ఏళ్ల నిరీక్షణ తర్వాత సైతం రష్యాకు ఫలితం దక్కలేదు. నెల రోజుల వ్యవధిలో ఆసక్తి రేకెత్తించిన లూనా25తో రష్యాకు నిరాశ తప్పలేదు. తక్కువ సమయంలో ప్రయోగం, వేగవంతమైన నిర్ణయాలే ప్రయోగాన్ని విఫలం చేశాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
ఆగస్టు 11న ఉన్నపళంగా లూనా 25ను ప్రయోగించింది రష్యా. మాస్కో నుంచి వెయ్యికిలోమీటర్ల దూరంలోని వోస్కోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి చంద్రుడిపై ల్యాండర్ ను దింపటమే లక్ష్యంగా రాకెట్ ప్రయోగించే వరకూ చాలా ప్రపంచ దేశాలకు దీనిపైనే సమాచారమే లేదు. రష్యా ఉన్నపళంగా చంద్రుడి మీద ఎందుకు ప్రయోగాలు చేపడుతోందని అనుకున్నారు కానీ లూనా 25 ప్రయోగం రెండేళ్ల క్రితమే జరగాల్సింది.
అప్పట్లో వాయిదాపడి, ఇప్పుడు తొందర పడి..
2021లో లూనా 25ను ప్రయోగించాలని అనుకున్నా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు సరిగా లేకపోవటం ఆ తర్వాత యుద్ధం కారంణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గత నెలలో లూన్ 25 ఇంకా అంతరిక్ష ప్రయోగాల మీద రాస్ కాస్మోస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చంద్రుడిపైకి ఆ ప్రయోగాన్ని చేపట్టాలని ఆదేశించటంతో లూనా 25 ప్రయోగం జరిగింది.
అప్పటికే ఇండియా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని ప్రయోగించటంతో స్లింగ్ షాట్ పద్ధతిలో టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోలేదు రష్యా. ఇంధనం, ఖర్చు ఎక్కువైనా సరే చంద్రుడి సౌత్ పోల్ మీద తమ ల్యాండర్ ను దింపాలని అది కూడా ఇండియా కంటే ముందుగానే చేయాలని డిసైడ్ అయ్యింది. బహిరంగంగా పుతిన్ ఎక్కడా ప్రకటన చేయకపోయినా.. ఇండియా, నాసా తో కలిసి ఆర్టెమిస్ ప్రయోగాలకు దిగటం దీనికి ఓ కారణంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి వెళ్లటమే లూనాకు సమస్యలు తెచ్చిపెట్టింది.
చంద్రయాన్ 3కి, లూనా 25కి వ్యత్యాసాలు ఇవే..
ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఉందని రాస్ కాస్మోస్ చెప్పినా...చంద్రుడిపై ల్యాండర్ కూలిపోయిందని మాత్రం అన్నీ నిర్దారించుకున్నాకే బయటపెట్టింది. మొత్తంగా 1976 తర్వాత అంటే 47 ఏళ్ల తర్వాత ప్రయోగాలు తిరిగి ప్రారంభించి చంద్రుడి సౌత్ పోల్ పై అడుగుపెట్టిన తొలిదేశంగా నిలవాలన్న రష్యా కల కలగానే మిగిలిపోయింది. చంద్రయాన్ 3 ప్రయోగం ఖర్చు రూ.600 కోట్లు కాగా, రష్యా చేసిన లూనా 25 ప్రయోగానికి దాదాపు రూ.1600 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బరువు పరంగా చూస్తే చంద్రయాన్ 3 పేలోడ్స్ బరువులో లూనా 25 బరువు సగం కూడా ఉండదు. కానీ భారత్ ప్రయోగం కంటే ముందు తాము సక్సెస్ కావాలని, తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలని ఆశించి రష్యా భంగపాటుకు గురైంది. చంద్రయాన్ 3 ప్రయోగం తరువాత అయినా సరే ఫెయిల్ కాకుండా సరైన విధంగా ప్రయోగించి ఉంటే రష్యా లూనా 25 సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది.