Female Chinese Official : 58 మంది లవర్స్ - రోజూ అదే పని - చైనాలో మహిళా గవర్నర్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష
China : చైనాలో ఓ మహిళా గవర్నర్ ఏకంగా 58 మందిలో శృంగారం చేసింది. లంచనాలతో కోట్లు కూడబెట్టింది. చివరికి దొరికిపోవడంతో 13 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
Physical Relationship With 58 Lovers : ఎవరైనా ఇద్దరో ముగ్గురితోనే శారీరక సంబంధాలు పెట్టుకుంటారు. ఇంకా ప్లే బోయ్ అయితే పది మంది .. కానీ ఆమె ప్లే గర్ల్..అయితే వయసు పెద్దయిపోయింది కాబట్టి ప్లే ఉమన్ అనుకోవచ్చు. ఆమె ఏకంగా 58 మందితో శారీరక సంబంధాలు పెట్టుకుంది. పైగా ఆషామాషీగా జల్సాగా తిరిగే మనిషి కాదు.ఓ రాష్ట్రానికి గవర్నర్ గా చేశారు. ఇంకా కీలక పదవుల్లో ఉన్నారు. అది మాత్రమే కాదు... ఇంకా చాలా చేశారు. చివరికి గుట్టు రట్టయింది.
చైనాలో ప్రజాస్వామ్యం లేదు. ఏక పార్టీ పాలన ఉంది. ఆ పార్టీలోని నేతలే పరిపాలన చేస్తూంటారు. అన్నిస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ నేతలు గవర్నర్లుగా.. అధికారులుగా ఉంటారు. ఇలాంటి పార్టీలో జోంగ్ యంగ్ అనే మహిళా నేత ఉన్నారు. ఆమె చురుకైన నేతగా పేరు తెచ్చుకుని కీలక పదవుల్ని పొందేవారు. ఓ రాష్ట్రానికి గవర్నర్ అలాగే.. మరికొన్ని కీలక పదవుల్లో పని చేశారు. కానీ ఆమెపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అదేమిటంటే విధుల్ని నిర్లక్ష్యం చేసి ఆమె తరచూ టూర్లకు వెళ్తున్నారని బాయ్ ఫ్రెండ్స్ తో శృంగార పర్యటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు విధి నిర్వహణలో కూడా అపరిమితమైన అవినితికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కమ్యూనిస్టు పార్టీ పెద్దలు అంతర్గతంగా విచారణ జరిపారు.
చైనాలో జరిపే విచారణలు పర్ ఫెక్ట్ గా ఉంటాయి. సాంకేతిక ఆధారాలతో సహా మొత్తం వివరాలు బయటకు లాగారు. ఆ ప్రకారం.. ఆ మహిళా అధికారి.. కనీసం 58 మందితో శారీరక సంబంధాలు పెట్టుకుని జల్సా చేశారని గుర్తించారు. ఆ యాభై ఎనిమిది మంది కూడా ఒప్పుకున్నారు. తర్వతా ఆమె చేసిన అవినీతిని ప్రతి రూపాయితో సహా లెక్క కట్టారు. ఎడెదనిమిది వందల కోట్లు వరకూ అక్రమార్జన చేసినట్లుగా గుర్తించారు. జాంగ్ చాలా ప్రైవేటు నైట్ క్లబ్బుల్లో తరచూ కనిపిస్తూంటారు. ప్రతి సారి ఓ కొత్త మగ స్నేహితుడు ఆమె వెంట ఉంటారని చాలా మంది స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
రెండున్నర లక్షలకు ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం - ఈ బీహార్ యువకుడు ఇలా బుక్కైపోయాడు !
జోంగ్ యంగ్ పై విచారణను వేగంగా పూర్తి చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం .. పదమూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యాభైల్లో ఉన్న ఆమె.. మరో పదమూడేళ్ల పాటు జైల్లో మగ్గి తర్వాత బయటకు రానున్నారు. చైనాలో అవినీతి పరులైన ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధిస్తూంటారు.