Sri Lanka's New PM: శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే - ప్రమాణం కూడా పూర్తి !
శ్రీలంక కొత్త ప్రధానిగా ఐదు సార్లు ప్రధానిగా చేసిన రణిల్ విక్రమసింఘె నియమితులయ్యారు. ఆయనతో అధ్యక్షుడు గోటబయ ప్రమాణస్వీకారం చేయించారు.
Sri Lanka's New PM: శ్రీలంకలో కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రమాణ స్వీకారం చేయించారు. గోటబయ రాజపక్సే తన కార్యనిర్వాహక అధికారాలను చాలా వరకు వదులుకుంటానని తాజాగా ప్రకటించారు. అయితే దేశ ఆర్థిక సంక్షోభంపై రాజీనామా చేయాలనే డిమాండ్‌లకు మాత్రం ఆయన తలొగ్గలేదు. యునైటెడ్ నేషనల్ పార్టీకి విక్రమసింఘేనే అధినేత. రణిల్ విక్రమసింఘే గతంలో ఐదు సార్లు శ్రీలంక ప్రధానిగా వ్యవహరించారు.
పుతిన్‌కు ఫిన్లాండ్ సవాల్- నాటోలో చేరుతున్నట్లు సంచలన ప్రకటన!
శ్రీలంకలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా గొటబయ రాజపక్స ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తన అధికారాలను తగ్గించుకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. పదవి నుంచి దిగిపోవడానికి మాత్రం అంగీకరించడం లేదని సమాచారం. కాగా, ఆయన రాజీనామా చేయాలంటూ గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో మొదటి సారి దేశ ప్రజలనుద్దేశించి గొటబయ ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని, విద్రోహ శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రధాని, ప్రభుత్వం వచ్చాక.. పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించేలా రాజ్యాంగ సంస్కరణలు చేపడతామన్నారు. యువ కేబినెట్‌ను ఏర్పాటుచేస్తానని, అందులో తమ కుటుంబ సభ్యులెవరూ ఉండబోరని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు.
శ్రీలంకకు భారత్ తన బలగాలు పంపిస్తుందా? వార్తల్లో నిజమెంత?
మాజీ ప్రధాని మహీంద రాజపక్సే పార్టీ కూడా విక్రమ సింఘేకే పూర్తి మద్దతిచ్చింది. ఇక.. పార్లమెంట్‌లో కూడా ఆయనకు మెజారిటీ అన్న ఇబ్బందులు ఉండవని శ్రీలంక మీడియా పేర్కొంది. ప్రజాందోళనలు మిన్నంటిన నేపథ్యంలో ప్రధాని పదవికి మహీంద రాజపక్సే రాజీనామా చేసేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే విధానాలు, ఆయన కుటుంబీకులే కారణమంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మాజీ ప్రధాని మహీంద రాజపక్సేకు శ్రీలంక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. మహీందతో పాటు ఆయన కుమారుడు, ఎంపీ నమల్ రాజపక్సతో పాటు మరో 15 మంది కూడా విదేశాలకు వెళ్లొద్దని కోర్టు ఆంక్షలు విధించింది.
శ్రీలంకలో అలా కనిపిస్తే కాల్చివేత - ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ !
శ్రీలంకలో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. మరో వైపు ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత రణిల్ విక్రమ సింఘేపై పడింది. గతంలో ఐదు సార్లు ప్రధానిగా చేసి ఉన్నందున... పరిస్థితిని అదుపులోకి తెస్తారని శ్రీలంక ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.