Finland NATO Membership: పుతిన్‌కు ఫిన్లాండ్ సవాల్- నాటోలో చేరుతున్నట్లు సంచలన ప్రకటన!
Finland NATO Membership: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తోన్న వేళ నాటో కూటమిలో చేరనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది.
Finland NATO Membership: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉద్ధృతంగా కొనసాగుతోన్న వేళ మరో ఐరోపా దేశం ఫిన్లాండ్ కీలక ప్రకటన చేసింది. నాటో కూటమిలో ఫిన్లాండ్ తక్షణమే చేరాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సౌలీ నీననిస్టో, ప్రధాని సన్నా మారిన్ సంయుక్త ప్రకటన చేశారు. ఇప్పటికే సభ్యత్వ దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.
Joint statement by the President of the Republic and Prime Minister of Finland on Finland's NATO membership:https://t.co/0xJ9OE70Cw@TPKanslia I @niinisto I @MarinSanna pic.twitter.com/ZviOgZ6v1n
— Finnish Government (@FinGovernment) May 12, 2022
ఉక్రెయిన్ వల్లే
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల వల్లే ఫిన్లాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా రష్యాతో ముప్పు ఉండటంతో నాటోలో చేరడం సురక్షితమని ఫిన్లాండ్ భావిస్తోంది.
రష్యా, ఫిన్లాండ్ మధ్య ఇంతకుముందు సరిహద్దు సమస్యలు వచ్చాయి. ఈ రెండు దేశాల మధ్య 1,340 కిలోమీటర్ల (830 మైళ్లు) మేర సరిహద్దు ఉంది. దీంతో ఉక్రెయిన్ తరహాలోనే రష్యా.. ఫిన్లాండ్‌పై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశం భయపడుతోంది. దీంతో వీలైనంత త్వరగా నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. మరో దేశం స్వీడన్ కూడా నాటో బృందంలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
రష్యా వార్నింగ్
నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్‌లను రష్యా ఇటీవల హెచ్చరించింది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రష్యా వారించింది.
ఉక్రెయిన్ దీటుగా
మరోవైపు రష్యపై పోరాటంలో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్ పట్టు సాధిస్తోంది. ఒక హబ్‌లో రష్యా సహజ వాయువును అడ్డుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా సహజ వాయువు సరఫరాపై ప్రభావం పడింది. ఉక్రెయిన్‌కు చెందిన సహజ వాయువు పైప్‌లైన్ ఆపరేటర్ తూర్పు ప్రాంతంలోని కీలక కేంద్రం ద్వారా రష్యా సహజ వాయువును నిలిపివేశారు. ఉక్రెయిన్ మీదుగా పశ్చిమ ఐరోపాకు వెళ్తున్న రష్యా గ్యాస్‌లో మూడోవంతు ఈ హబ్ ద్వారానే సరఫరా అవుతోంది.
Also Read: North Korea Coronavirus Cases: కరోనాకు భయపడిన కిమ్- తొలిసారి మాస్క్‌తో దర్శనం, ఇదే రీజన్!
Also Read: WhiteHat Jr Employees Resign: 800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!