Sri Lanka Crisis: శ్రీలంకకు భారత్‌ తన బలగాలు పంపిస్తుందా? వార్తల్లో నిజమెంత?

Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభం, తీవ్ర అల్లర్లతో అట్టుడుకుతోన్న శ్రీలంకకు భారత్ తన బలగాలను పంపిస్తుందా? ఈ వార్తల్లో నిజమెంత?

FOLLOW US: 

Sri Lanka Crisis: మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆ దేశానికి భారత్ తన బలగాలను పంపిస్తుందని పలు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత?

భారత్ స్పందన

ఈ వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంక‌కు భారత్ పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని పేర్కొంది. ఆ దేశ ప్ర‌జాస్వామ్యానికి, స్థిర‌త్వానికి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కొలంబోలోని భార‌త హై క‌మిష‌న్ వెల్ల‌డించింది. అయితే శ్రీలంకకు భారత్ తన బలగాలను పంపిస్తుందన్న వార్తలను మాత్రం ఖండించింది. 

" శ్రీలంకకు భారత్ తన బలగాలను తరలిస్తోందనే వార్తలు అసత్యం. మాజీ ప్ర‌ధాని మ‌హింద రాజ‌ప‌క్స‌, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు భారత్‌కు పరారైనట్లు వ‌స్తున్న ప్ర‌చారం కూడా అవాస్తవం. ఊహాజ‌నిత నివేదిక‌లపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి రిపోర్ట్‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం ఆమోదించ‌డం లేదు.                                                                         "
- శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం

తీవ్ర నిరసనలు

అల్లర్లు, హింసాత్మక ఆందోళనలతో శ్రీలంక అట్టుడుకుతోంది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన అల్లర్లలో 8 మంది చనిపోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు.

ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. హింసను విడనాడాలని, ఏకాభిప్రాయంతో రాజకీయ స్థిరత్వానికి కృషి చేయాలన్నారు. నిరసనకారులు మాత్రం అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు.

Also Read: Karnataka Loudspeaker Row: లౌడ్‌ స్పీకర్లపై నిషేధం- ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్!

Also Read: Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్‌ క్యాబ్‌లకు కేంద్రం షాక్- కఠిన చర్యలు తప్పవని వార్నింగ్!

Published at : 11 May 2022 02:33 PM (IST) Tags: MEA Sri Lanka crisis Sri Lanka Crisis News India on Sri Lanka Crisis

సంబంధిత కథనాలు

Hardik Patel Joining BJP:  ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

Hardik Patel Joining BJP: ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు

Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు

టాప్ స్టోరీస్

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం