News
News
X

ఇరాన్‌లో కౌగిలించుకొని నిరసన- హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇదో రకం

ఇరాన్‌లోని హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు మరో వినూత్న నిరసన చేపట్టారు.

FOLLOW US: 
 
ఇరాన్ ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా యువత నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుున్నారు. ఇప్పుడు ఈ నిరసన తెలపడానికి మరొక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. స్త్రీపురుషులు అనే భేదం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఒకరినొకరు కౌగిలించుకుని అభివాదం చేసుకుంటున్నారు. తమ నిరసన తెలుపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీపురుషులు కౌగిలించుకోవడం ఇరాన్ నిషేధం. అందుకే విద్యార్థులు, ప్రజలు ఇలా కౌగలించుకొని నిరసన తెలుపుతున్నారు. 

బహిరంగ ప్రదేశాల్లో స్త్రీపురుషులు కౌగలించుకోవడం విదేశీ సంస్కృతి అని... ఇరాన్‌లోని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. అందుకే దేశ సంస్కృతిని భ్రష్టుపట్టించే ఇలాంటి విదేశీ కల్చర్ వద్దని భావించి కౌగిలింతను నిషేధించారు. ఇది ఇస్లామిక్ సమాజంలో నైతికతకు భంగం కలిగిస్తుందని వాళ్ల నమ్మకం. 

ఏదేమైనా, కొంతమంది ఇప్పుడు వీటన్నింటికీ అతీతంగా పెరగడం ద్వారా పాత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇరాన్‌లోని కరాజ్ నగరానికి చెందిన కొందరు వ్యక్తులు ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేయడం, బహిరంగంగా ఒకరినొకరు పలకరించుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కనిపించింది.

ఈ వీడియోను ఇరాన్ జర్నలిస్ట్ మాసిహ్ అలినేజాద్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇరాన్‌లోని కరాజ్ నుంచి ఓ మహిళ ఈ వీడియో పంపించారని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో బాలబాలికలు 7 ఏళ్ల తర్వాత నుంచి వేర్వేరుగా విద్యాభ్యసం చేస్తారు. పురుషులు, మహిళలు ఒకరినొకరు కౌగిలించుకోవడం, కరచాలనం చేయడం, పార్టీలకు హాజరు కావడం నిషిద్ధం. వీడియోలో కనిపించే వాళ్లంతా కౌగిలించుకొని చట్టాన్ని ఉల్లంఘించారు.

Published at : 25 Oct 2022 01:45 PM (IST) Tags: iran Mahsa Amini

సంబంధిత కథనాలు

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

Elon Musk On Trump: 'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్

Elon Musk On Trump: 'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్

Amazon Layoffs: 10 వేలు కాదు అంతకు మించి, అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు - 20 వేల ఉద్యోగాల కోత!

Amazon Layoffs: 10 వేలు కాదు అంతకు మించి, అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు - 20 వేల ఉద్యోగాల కోత!

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!