Prophet Remark Row: నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా రియాక్షన్ ఇదే
Prophet Remark Row: నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా ఖండించింది.
Prophet Remark Row: మహ్మద్ ప్రవక్తపై ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం ఖండించింది.
వ్యాఖ్యల దుమారం
మహ్మద్ ప్రవక్తపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను అనేక ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. దీంతో భాజపా.. నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ముంబయి పోలీసులు మే 28న నుపుర్ శర్మపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ముంబయిలోని పిదోనీ పోలీసులు కూడా నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని నుపుర్ శర్మ.. దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ పోలీసులు నుపుర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు.
Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది