Pakistan Political Crisis: సుప్రీం కోర్టుకు ప్రతిపక్షాలు- 90 రోజుల్లో పాకిస్థాన్‌లో ఎన్నికలు
పాకిస్థాన్‌లో మరో 90 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీని ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ రద్దు చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే నేషనల్ అసెంబ్లీని రద్దు చేయడంతో 90 రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనుమతించలేదు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. విదేశీ కుట్ర, దేశ భద్రత కారణాలను చూపుతూ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు
విదేశీ కుట్ర
సుప్రీంలో
అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
Also Read: Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై
Also Read: Covid 19 Cases China: చైనాలో మళ్లీ కరోనా గుబులు, భారీగా పెరిగిన కేసులు- కొత్త సబ్ వేరియంట్ డేంజర్