అన్వేషించండి

Pakistan Political Crisis: పాకిస్థాన్ 'ఆవేశం' స్టార్- ప్రధాని పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఆయనే!

పాకిస్థాన్ ప్రధాని పదవికి తమ ఉమ్మడి అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్‌ను నియమించాయి. జాతీయ అసెంబ్లీలో సోమవారం ఓటింగ్ జరగనుంది.

ఆయన మాట్లాడితే స్పీకర్లు పగిలిపోతాయి.. మైకులు ఎగిరిపోతాయి.. అవును పాకిస్థాన్ 'ఆవేశం స్టార్‌'గా పేరుపొందిన ఆయనే షెహబాజ్ షరీఫ్.  పాకిస్థాన్ ప్రతిపక్షాలు తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్‌ను ఆదివారం నియమించాయి.

ప్రతిపక్షాలకు జాతీయ అసెంబ్లీలో సంఖ్యా బలం ఉండటంతో షెహబాజ్.. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఆయన గురించి తెలుసుకుందాం.

ఎవరంటే?

మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. 

షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వీటన్నింటిని మించి షెహబాజ్ ప్రసంగాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయంలో చేతులను చాలా వేగంగా కదిలిస్తారు. అంతేకాకుండా చాలా ఆవేశంగా మాట్లాడతారు. చాలా సార్లు ఆయన మాట్లాడే సమయంలో ముందు ఉన్న మైకులను కూడా పడేస్తుంటారు. 

కృతజ్ఞతలు

తనను ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా, పౌరులు రాజ్యాంగానికి మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

పాకిస్థాన్ పార్లమెంటు తాత్కాలిక స్పీకర్ అయాజ్ సాదిక్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నూతన ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు సోమవారం నేషనల్ అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. 

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 

Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి

Also Read: Optical illusion: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Embed widget