By: ABP Desam | Updated at : 28 Mar 2022 01:29 PM (IST)
Edited By: Murali Krishna
ఇమ్రాన్ ఖాన్ టైం ఆయేగా! నేడే అవిశ్వాస తీర్మానం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ మాత్రం ఏప్రిల్ 4న జరగనున్నట్లు పాకిస్థాన్ న్యూస్ ఏజెన్సీ డాన్ తెలిపింది.
పాక్ జాతీయ అసెంబ్లీ నియమాల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మూడు రోజుల లోపు ఓటింగ్ నిర్వహించకూడదు. అలానే ఏడు రోజుల లోపు ఓటింగ్ ముగించాలి.
ప్రధాని ప్రయత్నాలు
మరోవైపు అవిశ్వాస తీర్మానం గండం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా మద్దతును కూడగట్టేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభను పెట్టారు. అయితే ఇందుకు ప్రతిగా ప్రతిపక్షాలు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపడుతున్నాయి.
స్పీకర్‌పై విమర్శలు
మరోవైపు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైజర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో కావాలనే స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు కూడగట్టుకునేందుకు స్పీకర్ సాయం చేస్తున్నారన్నారు.
నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి సహకరిస్తామని తేల్చిచెప్పాయి. మరోవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షాలు కూడా హ్యాండ్ ఇచ్చాయి.
అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను కూడా ఇమ్రాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంత కావాలి?
మొత్తం 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. అయితే దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం ఉంచుకోగలిగింది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ క్రికెట్‌లో చేసినట్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.
Also Read: West Bengal Assembly: బంగాల్ అసెంబ్లీలో దంగల్- చొక్కాలు చిరిగేలా ఎమ్మెల్యేల ఫైట్
Also Read: WATCH: యూపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన- యోగి, అఖిలేశ్ 'ఫేస్ టూ ఫేస్'
MLC Kavitha: అప్పుడు ఎన్టీఆర్ వల్ల, ఇప్పుడు కేసీఆర్‌తో ఆ గుర్తింపు వచ్చింది: ఎమ్మెల్సీ కవిత
Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్
Bill Gates Resume: బిల్‌గేట్స్ రెజ్యూమ్ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు
Ukraine Crisis: పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ
UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?
Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!
Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్