By: ABP Desam | Updated at : 28 Mar 2022 02:31 PM (IST)
Edited By: Murali Krishna
బంగాల్ అసెంబ్లీలో దంగల్- చొక్కాలు చిరిగేలా ఎమ్మెల్యేల ఫైట్
బంగాల్ అసెంబ్లీలో ఘర్షణ చెలరేగింది. బీర్భూమ్ హింసాకాండపై చర్చ చేపట్టాలని భాజపా ఎమ్మెల్యేలు పట్టు పట్టారు. ఇందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో భాజపా శాసనసభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత టీఎంసీ, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తోపులాటలో కొంతమంది ఎమ్మెల్యేలు చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఈ ఘర్షణలో భాజపా ఎమ్మెల్యే మనోజ్ టిగ్గా గాయపడ్డారు.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
భాజపా వాకౌట్
ఘర్షణ తర్వాత భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజూందార్‌కి కూడా తోపులాటలో గాయాలయ్యాయని పార్టీ పేర్కొంది. ఆయన ముక్కుకి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీరియస్ అయిన స్పీకర్ ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత అసెంబ్లీ బయట భాజపా ఎమ్మెల్యేలు నిరసన చేశారు. బీర్భూమ్ హింసపై చర్చ చేపట్టమన్నందుకే తమపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలపై దాడి చేసి చొక్కాలు చింపేసారని భాజపా నేత సువేందు అధికారి ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బంగాల్ గవర్నర్‌పై దాడి తర్వాత ఇప్పుడు భాజపా ఎమ్మెల్యేలపై టీఎంసీ శాసనసభ్యులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
దారుణం
రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.
ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయినవారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు.
Saviors in Uniform : ఎవరినీ డేర్ చేయని మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ - ఆమె ధైర్యం మహిళలకు స్ఫూర్తి !
Best Verdicts Laws In India: భారత్‌లో చరిత్రాత్మక చట్టాలు, తీర్పులు - అవేంటంటే?
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు
India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?