By: ABP Desam | Updated at : 28 Mar 2022 12:10 PM (IST)
Edited By: Murali Krishna
యూపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన- యోగి, అఖిలేశ్ 'ఫేస్ టూ ఫేస్'
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎన్నికల వేళ వారిద్దరూ ఒకరిపైఒకరు చేసుకున్న విమర్శల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి వీరిద్దరూ ఎదురెదురు పడితే ఏమవుతుంది? ఆసక్తికరంగా ఉంది కదా.. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఈ ఆసక్తికర ఘటన జరిగింది.
#WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022
ఏం చేశారు?
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. యూపీ అసెంబ్లీలో నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫేస్ టూ ఫేస్ రావాల్సి వచ్చింది. అయితే ఒకరినొకరు చూసి ఆప్యాయంగా నవ్వుకున్నారు. అంతేకాదు యోగికి అఖిలేశ్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు యోగిని 'బాబా ముఖ్యమంత్రి' అంటూ అఖిలేశ్ విమర్శలు చేశారు. మరోవైపు యోగి.. సమాజ్‌వాదీలను 'పరివార్‌వాదీ' అని అన్నారు.
భారీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేసింది.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!
ప్రధాని మోదీకి పాకిస్థాన్లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?
JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Madhya Pradesh Lightning : మధ్యప్రదేశ్ లో విషాదం, పిడుగుపాటుకు 9 మంది మృతి!
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Rabindranath Tagore: ఐన్స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?
PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!