అన్వేషించండి

గుణపాఠం నేర్చుకున్నాం- శాంతి కోరుకుంటున్నాం: ప్రధాని మోదీకి పాకిస్థాన్‌ పీఎం షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి

చర్చల కోసం పాకిస్థాన్‌తో కూర్చోవాలని భారత నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. పాకిస్థాన్ మూడు యుద్ధాల్లో గుణపాఠం నేర్చుకుంది.

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గోదమ పిండి కోసం కొట్టుకున్న దృశ్యాలను చూస్తున్నాం. దీంతో పాకిస్థాన్‌ స్వరంలో మార్పు కనిపిస్తోంది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటోందని ప్రధాని అన్నారు.

అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని మాట్లాడుతూ ప్రతి సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చర్చలకు కూర్చొని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని భారత నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను.

భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాము పొరుగు దేశాలమని పాక్ ప్రధాని పేర్కొన్నారు. ప్రశాంతంగా బతకాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత్‌తో తాము మూడు యుద్ధాలు చేశామని, ప్రతిసారీ ప్రజలకు మరింత కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తీసుకొచ్చామని అన్నారు. పాఠం నేర్చుకున్నామని, ప్రశాంతంగా బతకాలనుకుంటున్నామని ప్రాధేయపడ్డారు.

'మా సమస్య పరిష్కారానికి మేం సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడుకుందామని ప్రధాని నరేంద్ర మోదీకి నా విజ్ఞప్తి. బాంబులు, ఆయుధాల తయారీ కోసం తమ వనరులను ఖర్చు చేయడం పాక్ కు ఇష్టం లేదన్నారు.

అణుశక్తి గురించి మాట్లాడిన షరీఫ్‌... యుద్ధం ఎవరికీ మంచిది కాదన్నారు. తాము అణ్వాయుధాలు కలిగి ఉన్నామని యుద్ధాని కోరుకుంటే.. ఏం జరిగిందో చెప్పడానికి ఇంకా జీవించేది ఎవరు. భారత్- పాక్ మధ్య కీలక పాత్ర పోషించగలరని యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ కు చెప్పాను.

భారత్ తో మూడు సార్లు ప్రత్యక్ష యుద్ధం చేసిన పాకిస్థాన్ మూడుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1965లో భారత్, పాకిస్థాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది. ఆ సమయంలో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ నాయకత్వంలో సైనిక పాలనలో ఉంది. పాక్ పై భారత సైన్యం విరుచుకుపడింది. తాష్కెంట్ ఒప్పందం తర్వాత ఈ యుద్ధం ముగిసింది.

రెండో యుద్ధం 1971లో భారత్- పాక్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ అవమానకరమైన ఓటమిని చవిచూసింది. దాని నుంచి ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ రెండు భాగాలుగా విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా వంటి అగ్రరాజ్యం ఒత్తిడిని కాదని భారత్‌ పోరాడి విజయం సాధించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన 90 వేల మంది సైనికులు లొంగిపోయారు. ఆ తర్వాత భారత సైనిక వ్యూహాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు.

1999లో కార్గిల్ లో పాకిస్థాన్ మూడో యుద్ధం చేసింది. ఈ సమయంలో పాక్ సైనికులు రహస్యంగా నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత్ భూభాగాలపై తిష్ట వేశారు. అలర్ట్ అయిన భారత్‌ ఎదురు దాడి చేసి పాకిస్థాన్‌ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక స్థావరాలను నేల కూల్చేసింది. పాకిస్థాన్‌ సైన్యానికి బుద్ది చెప్పింది. ఈ యుద్ధంలో తమ దళాలు లేవని మొదట పాకిస్తాన్ ఖండించినప్పటికీ, తరువాత అంగీకరించింది. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని భారతదేశం నుంచి స్వాధీనం చేసుకుంటుందని ముషారఫ్ ఆశించారు, కాని  ధైర్యవంతులైన భారత్‌ సైనికులు పాకిస్థాన్‌ ప్రణాళికలను చిత్తు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget