Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాల డెడ్లీ బౌన్సర్- 24 గంటల్లో దిగిపోవాలని డిమాండ్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు తీర్మానించాయి. అంతకుముందే ఇమ్రాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద షాక్ తగిలింది. ప్రధాని పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్థాన్ ఆర్థికంగా మరింత దిగజారిపోయిందని ఆరోపించాయి.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించాయి.
భారీ నిరసన
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పరిపాలన అత్యంత దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అంతలేదు
ప్రతిపక్షాల డిమాండ్లను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే ప్రతిపక్షాలు అందుకు పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు.
Also Read: Vladimir Putin Lover: గుప్పెడంత పుతిన్ మనసులో ఉప్పెనంత ప్రేమ- మీకు అర్థమవుతోందా?
Also Read: Happy Women's Day 2022: 'నారీశక్తి'కి సెల్యూట్- మహిళలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు