By: ABP Desam | Updated at : 23 Mar 2022 08:14 PM (IST)
Edited By: Murali Krishna
ఇమ్రాన్ ఖాన్‌కు షాక్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 3 ప్రధాన భాగస్వామ పార్టీలు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. దీంతో అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సొంత పార్టీ సెగ
నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి సహకరిస్తామని తేల్చిచెప్పాయి. మరోవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షాలు కూడా హ్యాండ్ ఇచ్చాయి.
ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్మీ సపోర్ట్ ఉంది. ఈ కారణంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే ఏదో విధంగా గట్టెక్కుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెబల్ ఎంపీలను ఆర్మీ ద్వారా కిడ్నాప్ చేయించి తీసుకు రావడం లేదా ఇతర వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ ఆర్మీ పూర్తి స్థాయిలో సహకరించకపోతే.. ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ మధ్యలోనే క్లీన్ బౌల్డ్ అయినట్లవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఆర్మీ కూడా ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
ఎంత కావాలి?
మొత్తం 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. అయితే దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం ఉంచుకోగలిగింది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ క్రికెట్‌లో చేసినట్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.
Also Read: Afghan Girls: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం! అయోమయంలో అఫ్గాన్ బాలికలు
Also Read: Corona Lockdown in US: అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్- ఆ వేరియంట్‌తో ముప్పు తప్పదా?
US President strong Warning to China: చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Australia Elections: ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్ పరిపాలనకు తెర- కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్