Afghan Girls: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం! అయోమయంలో అఫ్గాన్ బాలికలు
తాలిబన్లు మరోసారి తమ నిజస్వరూపం బయటపెట్టారు. బాలికలను ఉన్నత చదువులకు అనుమతించబోమని తెలిపారు.
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్‌ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. తాజాగా తాలిబన్లు మరోసారి మాట తప్పారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు.
ఎందుకిలా?
బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కానీ పాఠశాలలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే స్కూల్ వరకు వెళ్లిన బాలికలు.. తమను లోపలికి రానివ్వకపోవంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ స్వేచ్ఛను హరించవద్దని ప్రాధేయపడుతున్నారు. చదువుకునే స్వేచ్ఛను కూడా తాలిబన్లు లాగేసుకోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
A girl in Kabul cried while talking about being prevented from entering the classroom. She urged the Islamic Emirate to reopen all girls’ schools across the country.#TOLOnews pic.twitter.com/MPcmOLxjUw
— TOLOnews (@TOLOnews) March 23, 2022
కల్లబుల్లి మాటలు
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు
వారిపై తోసేసి
తాము ఈ నిర్ణయం తీసుకునేందుకు గ్రామీణ ప్రజలే కారణమని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఇందుకోసమే బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంటూ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అయితే తాలిబన్లతో పోరాడాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అఫ్గాన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారు. దీంతో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి అఫ్గాన్ ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయి.
Also Read: Russia Ukraine War: రష్యా అంటే నాటోకు భయం- ఊ అంటారా ఊఊ అంటారా: జెలెన్‌స్కీ
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్