Corona Lockdown in US: అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్- ఆ వేరియంట్‌తో ముప్పు తప్పదా?
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి,.
కరోనా థర్డ్ వేవ్ తర్వాత మహమ్మారి కాస్త శాంతించింది. అయితే తాజాగా చైనా సహా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ వంటి చర్యలు చేపడతున్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా త్వరలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దాంతో ప్రమాదమే
ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తుందని శ్వేతసౌధం ముఖ్య ఆరోగ్య సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఒమిక్రాన్‌తో పోలిస్తే కొత్త వేరియంట్ బీఏ.2.. 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ఫౌచీ అన్నారు. అయితే ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు ఉండబోవన్నారు. అమెరికాలో నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ ఉప వేరియంట్ రకానికి చెందినవే 30 శాతం ఉంటాయన్నారు. అమెరికాలో అత్యంత ప్రభావం చూపే వేరియంట్‌గా బీఏ.2 నిలుస్తుందని అంచనా వేశారు ఆంటోనీ ఫౌచీ.
చైనాలో లాక్‌డౌన్
చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా చైనాలో దాదాపు ఏడాది తర్వాత వైరస్ మరణాలు నమోదయ్యాయి. 2021 జనవరి తర్వాత ఈ దేశంలో వైరస్ మరణాలు మళ్లీ ఈ నెలలోనే నమోదయ్యాయి. ఇప్పటికే చైనాలో 4 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు.
Also Read: Russia Ukraine War: రష్యా అంటే నాటోకు భయం- ఊ అంటారా ఊఊ అంటారా: జెలెన్‌స్కీ
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్