Pakistan Ex ISI chief: భారత్‌పై కుట్రలు పన్నిన ఐఎస్‌ఐ మాజీ చీఫ్ భంగపాటు- పాక్‌లోనే మరణశిక్ష!
Pakistan: భారత్‌పై నిరంతరం కుట్రలు పన్నిన ఐఎస్‌ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్‌కు పాకిస్థాన్‌లో మరణశిక్ష లేదా జీవితఖైదు పడనుంది. ప్రస్తుతం ఆయనపై దేశద్రోహం సహా తీవ్ర అభియోగాలే ఉన్నాయి.
Pakistan Ex ISI chief: దాయాది దేశం పాకిస్థాన్(Pakistan) తరఫున నిరంతరం కుట్రలు పన్ని.. భారతదేశాన్ని(India) ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలని.. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భావించిన ఐఎస్ ఐ(ISI) మాజీ చీఫ్ ఫైజ్ హమీద్(Fize Hameed) పాపం పండింది. చివరకు ఆయన స్వదేశంలోనే మరణ శిక్ష ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఫైజ్ హమీద్‌కు మరణ శిక్ష(Death sentence) లేదా..తత్సమానపై జీవిత ఖైదు(Lifeprison)ను విధించే అవకాశం ఉంది.
ఎవరీయన?
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ మాజీ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సమయంలో నిరంతరం భారత్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నారు. ఉగ్రవాదులకు సమాచారం అందించడంతోపాటు వారికి సహకరించడం ద్వారా భారత్‌లో అస్థిరతకు కుట్రలు పన్నారు. అయితే.. పదవీ విరమణ అనంతరం.. హమీద్ ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడిపోయారు. పాకిస్థాన్ ప్రభుత్వం నమోదు చేసిన పలు కేసుల్లో ఆయనకు ఊపిరి ఆడడం లేదు. పైగా తలపై కత్తి వేలాడుతుండడం గమనార్హం. హమీద్(Hameed)కు ఏకంగా మరణ శిక్ష లేదా.. జీవిత ఖైదును విధించే అవకాశం ఉన్నట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
Also Read: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
ఏం జరిగింది?
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imrankhan)కు సన్నిహితుడుగా పేరొందిన ఐఎస్ ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్.. తన పదవీ కాలంలో అనేక అకృత్యాలకు పాల్పడ్డారన్నదిఆయనపై నమోదైన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
ఇవీ తీవ్ర అభియోగాలు..
1) పాకిస్థాన్ భద్రతకు ముప్పువాటిల్లేలా కుట్రలు పన్నడం
2) గోప్యతా చట్టాలను ఉల్లంఘించడం
3) ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం
4) దేశ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం
5) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో.. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఐఎస్ ఐ చీఫ్ పదవి నుంచి తొలగించేలా కుట్ర చేయడం.
ఆగస్టు నుంచే విచారణ
ఐఎస్ఐ మాజీ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్ పై పాక్ సైనిక కోర్టు `మార్షల్` విచారణను ప్రారంభించింది. అధికారిక రహస్యాల చట్టం, ఇతర తీవ్రమైన నేరాల కింద ఈ ఏడాది ఆగస్టు 12 నుంచే విచారణ జరుగుతోంది. హమీద్ కనుక దోషిగా తేలితే.. ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉందని పాక్ ఆర్మీ అధికారిక ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. హమీద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మునీర్ సిఫార్సు చేయడం గమనార్హం. అంతేకాదు... సైన్యం చెబుతున్న విషయం ప్రకారం.. మే 9, 2023న జరిగిన సంఘటనలకు సంబంధించి జనరల్ ఫైజ్ హమీద్‌పై ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. కోర్ట్ మార్షల్ ప్రక్రియలో జనరల్ హమీద్‌కు అన్ని చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ఇది కేవలం సైనిక చట్టానికి మాత్రమే పరిమితం కాదని, జాతీయ భద్రత, రాజకీయ జోక్యానికి భంగం కలిగించే తీవ్రమైన అంశాలు కూడా ఉన్నాయని.. కాబట్టి అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతున్నట్టు వివరించింది. ఈ అభియోగాలు నిరూపణ అయితే.. ఆర్మీ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం హమీద్‌కు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చునని సైన్యం పేర్కొంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు తెలిసింది.