Pakistan PM Imran Khan: ఆయన ఓ మెంటల్ కేస్- ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య కామెంట్స్
ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన ఓ పిచ్చోడని వ్యాఖ్యానించింది.
![Pakistan PM Imran Khan: ఆయన ఓ మెంటల్ కేస్- ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య కామెంట్స్ Pak PM Dodges Ouster Bid Ex-Wife Calls Him Mad Man Extremely Unsafe For Country Pakistan PM Imran Khan: ఆయన ఓ మెంటల్ కేస్- ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/04/24a4196b5d53e489356433d7adafdced_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాకిస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకుండా ఇమ్రాన్ ఖాన్.. అసెంబ్లీనే రద్దు చేయించారు. ప్రజాకోర్టులోనే తాడోపేడో తేల్చుకుంటానన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన మాజీ భార్య, జర్నలిస్ట్ రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండో భార్య
రెహమ్ ఖాన్.. ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య. 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమె నుంచి విడిపోయారు. 2015 జనవరిలో బీబీసీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు ఇమ్రాన్. అయితే తొమ్మిది నెలలకే వీరి వివాహ బంధం తెగిపోయింది.
ఆ తర్వాత మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా ఇమ్రాన్‌తో విడిపోయారు.
సుప్రీం
పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో పాటు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆదివారం దాఖలైన ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సోమవారం కూడా కాసేపు వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.
పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో న్యాయమూర్తుల బెంచ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాక్‌లో రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
Also Read: Fact Check : పంజాబ్ కొత్త సీఎం బైక్ దొంగనా ? ఇదిగో నిజం
Also Read: Hijab Row: విద్యార్థుల నుంచి టీచర్లకు చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)