Omicron Symptoms In Kids: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు.. అధిక జ్వరం, దగ్గు, తలనొప్పి రావొచ్చు!
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్ వేరియంట్ గురించి సాధ్యమైనంత ఎక్కువగా సమాచారాన్ని సేకరించేదుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఒమిక్రాన్ భయం పట్టుకుంది. అన్నీ దేశాలు కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పై భయందోళనలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. నిజానికి దక్షిణాఫ్రికాలోని పిల్లలు అత్యధిక సంఖ్యలో వేరియంట్ కేసులను కలిగి ఉన్నారు. ఈ పిల్లల్లో కొందరు తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలను ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికా మరియు యూకే డేటా ప్రకారం.. ఈ వేరియంట్ ఇప్పుడు పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని తెలుస్తోంది. రానున్న కాలంలో ఈ వేరియంట్ అందరికీ పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ కిందటి వేరియంట్లలో పిల్లలలో చాలా తేలికపాటి లేదా ఎటువంటి లక్షణాలు కనిపించలేదని నిపుణుల మాట. కానీ దీనిలో ఒమిక్రాన్ పరిస్థితి వేరే ఉందని అంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. ఒమిక్రాన్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. దాని లక్షణాలపై సకాలంలో చికిత్స చేయగలిగేలా శ్రద్ధ వహించాలి. ఒమిక్రాన్ లక్షణాలు ప్రతి ఒక్కరిలో విభిన్నంగా ఉండవచ్చ అని వైద్యులు చెబుతున్నారు. యువతలోమరింత అలసట, శరీర నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్ 19 నాల్గొ వేవ్ లో పిల్లలు అధికంగా ఆసుపత్రిలో చేరారని.. ఇన్ఫెక్షన్లు స్వల్పంగా ఉన్నందున భయాందోళనలకు గురికాకూడదని చెప్పారు.
ప్రావిన్స్‌లోని ఆసుపత్రులలో ఉన్న 1,511 మంది కొవిడ్ పాజిటివ్ రోగులలో.., 113 మంది 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ Ntsakisi Maluleke చెప్పారు. ఇది మునుపటితో పోల్చుకుంటే ఎక్కువ అని తెలిపారు. అయితే కొవిడ్ 19 పరీక్షలు చేసిన వారి నుంచి కొద్ది శాతం మంది నమూనాలు మాత్రమే జేనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఆసుపత్రిలో చేరిన పిల్లలు వేరియంట్ బారిన పడ్డారో అధికారులకు ఇంకా తెలియదు.
'ఇప్పుడు ఇక్కడకు వస్తున్న పిల్లల్లో మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. వారికి ఆక్సిజన్, సపోర్టివ్ థెరపీ మరియు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండడం అవసరం. వారు మునుపటి కంటే ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు' అని క్రిస్ హానీ బార్గవానాథ్ అకడమిక్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రుడో మాథివా చెప్పారు.
'ఓమిక్రాన్ యొక్క ప్రధాన లక్షణాలు యువకులలో అలసట, శరీర నొప్పులు మరియు తలనొప్పి. డెల్టా మాదిరిగా కాకుండా.. ఇప్పటివరకు రోగులు వాసన లేదా రుచి కోల్పోయినట్లు తేలలేదు.' అని సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీని తెలిపారు.
గత నెలలో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా ఒమిక్రాన్ ను గుర్తించారు. వేరియంట్ వల్ల అనారోగ్యం తీవ్రత ఏంటో శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేదు.
దక్షిణాఫ్రికా పాజిటివ్ COVID-19 పరీక్షల్లో కొద్ది శాతం మాత్రమే జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపబడినందున, ఆసుపత్రిలో చేరిన పిల్లలు ఏ వేరియంట్‌ల బారిన పడ్డారో అధికారులకు ఇంకా తెలియదు.
Also Read: Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు
Also Read: Omicron Cases Tally: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు... 23కి చేరిన మొత్తం కేసులు
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!