Porn in Live News: లైవ్‌లో న్యూస్ చెప్తుండగా ప్లే అయిన పోర్న్ వీడియో.. క్షమాపణలు చెప్పిన ఛానెల్
పోర్న్ క్లిప్ ఛానెల్‌లోని డేటా బేస్ లోకి ఎలా వచ్చింది? దాన్ని లైవ్‌లో ఎవరు ప్లే చేశారు? పొరపాటున రిగిందా? లేక ఉద్దేశ పూర్వకంగా జరిగిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సాయంత్రం ఆరు గంటలు.. ఓ న్యూస్ టీవీ ఛానెల్‌లో వెదర్ రిపోర్ట్ ప్రసారమవుతోంది. ఇద్దరు న్యూస్ యాంకర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయో తమ వెనక ఉన్న తెరపై దృశ్యరూపకంగా వివరిస్తున్నారు. ఆ న్యూస్ ఛానెల్‌ను చూస్తున్న వీక్షకులంతా వెదర్ రిపోర్ట్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో వీక్షకులంతా విస్తుపోయేలా ఓ పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 13 సెకండ్ల పాటు జరిగిన ఆ ఘటన ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. కానీ, భారీ తప్పిదం జరిగిపోయింది. చివరికి సదరు న్యూస్ ఛానెల్ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
అమెరికాలో ‘క్రెమ్ 2’ అనే ఓ న్యూస్ ఛానెల్ ఉంది. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే ఈ ఛానెల్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇద్దరు న్యూస్ యాంకర్లు వాతావరణ వార్తలు ప్రత్యక్ష ప్రసారంలో చెబుతున్నారు. ఇంతలో వారి వెనుక ఉన్న తెరపై పోర్న్ క్లిప్ ప్లే అయింది. ఈ పోర్న్ క్లిప్ దాదాపు 13 సెకండ్ల పాటు ప్లే అయింది. అప్పటి వరకూ కూడా ఆ ఇద్దరు యాంకర్లు తమ వెనుక ప్రసారం అవుతున్న ఆ క్లిప్ గురించి గమనించనేలేదు. ఇంతలో ఛానెల్‌కి చెందిన టెక్నికల్ టీమ్ ఆ భారీ తప్పును గుర్తించి సరిదిద్దాయి. అప్పటికే 13 సెకండ్ల మేర పోర్న్ క్లిప్ లైవ్‌లోనే ప్లే అయింది.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
అయితే, ఈ ఘటన గత ఆదివారం జరిగినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ పరిణామం జరగ్గా.. రాత్రి 11 గంటల సమయంలో ఈ తప్పిదానికి సంబంధించి ఛానెల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది. ‘క్రెమ్ 2’ మాతృ సంస్థ టీఈజీఎన్ఏ చీఫ్ కమ్యూనికేషన్ అధికారి అన్నే బెంట్లీ కూడా తమ ఛానెల్‌లో ఈ తప్పిదం జరిగినట్లుగా చెప్పారు. అంతేకాక, ఈ తప్పిదం పట్ల వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
పోర్న్ క్లిప్ ఛానెల్‌లోని డేటా బేస్ లోకి ఎలా వచ్చింది? దాన్ని లైవ్‌లో ఎవరు ప్లే చేశారు? పొరపాటున రిగిందా? లేక ఉద్దేశ పూర్వకంగా జరిగిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: నన్నే బహిష్కరిస్తారా.. నేనే కొత్త సర్వీస్‌తో వస్తా.. ఫేస్‌బుక్, ట్వీటర్‌లపై ట్రంప్ వార్!
Also Read: అన్ని నగరాల్లో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..
Also Read: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!