US honeymoon: హనీమూన్‌కు వెళ్తే 140 రోజుల పాటు నిర్బంధించారు - అమెరికాలో ఈ యువతికి మర్చిపోలేని కష్టం !
ICE: అమెరికాలో ICE ఆగడాలకు ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనీమూన్ కు వెళ్లిన ఓ యువతిని 140 రోజుల పాటు నిర్బంధించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

US honeymoon ICE officers : అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్.. అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిని డిపోర్టు చేయడానికి హద్దులు దాటిపోతోంది.ఈ క్రమంలో చట్టబద్ధంగా ఉంటున్న వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఓ పాలస్తీనియన్ మహిళపై ఐస్ సిబ్బంది వ్యవహరించిన విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతోంది.
వార్డ్ సకీక్ అనే 22 ఏళ్ల పాలస్తీనియన్ మహిళ అమెరికన్ పౌరుడ్ని వివాహం చేసుకుంది. ఆమె సౌదీ అరేబియాలో జన్మించింది కానీ అక్కడ పౌరసత్వం పొందలేదు. 8 సంవత్సరాల వయసులో తన కుటుంబంతో 2011లో అమెరికాకు వచ్చింది. ఆశ్రయం కోసం దరఖాస్తు చేసింది. అయితే పౌరసత్వం రాలేదు. ఆమె తన వివాహం తర్వాత జనవరి 2025లో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసింది. మొదటి దశలో ఆమె దరఖాస్తును అంగీకరించిన్పటికీ..తర్వాత ఎప్పుడో ఎనిమిదేళ్ల వయసులో ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తు కారణంగా ఐస్ సిబ్బంది నిర్బంధించారు.
ఫిబ్రవరి 2025లో, వార్డ్ సకీక్ తన హనీమూన్ నుండి మయామి ఎయిర్‌పోర్ట్ వద్ద తిరిగి వచ్చినప్పుడు ICE సిబ్బంది నిర్బంధించారు. ఆమె 140 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఈ సమయంలో తనను ఓ "పశువులా " చూశారని సకీక్ ఆవేదన వ్యక్తంమ చేస్తోంది. సంకెళ్లతో బంధించి 16 గంటల పాటు ఆహారం , నీరు లేకుండా బస్సులో తరలించారని.. తన భర్త లేదా న్యాయవాదితో సంప్రదించడానికి ఫోన్ కాల్ అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో 36 నుండి 50 గంటల వరకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి కూడా అనుమతించలేదన్నారు.
ICE ఆమెను రెండుసార్లు డిపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది, రెండు సందర్భాల్లోనూ ఫెడరల్ కోర్టు ఆర్డర్‌ను ఉల్లంఘించింది. మొదటి ప్రయత్నం జూన్ 12, 2025న జరిగింది, అప్పుడు ఆమెను ఫోర్ట్ వర్త్ అలయన్స్ ఎయిర్‌పోర్ట్‌లోని టార్మాక్‌కు తీసుకెళ్లి "ఇజ్రాయెల్ సరిహద్దు"కు డిపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆమెకు అక్కడ కూడా పౌరసత్వం లేదు. ఇజ్రాయెల్ లేదా వెస్ట్ బ్యాంక్‌లో పౌరసత్వం కోసం చట్టపరమైన మార్గం లేదు. రెండో సారి అదే ప్రయత్నం చేశారు. అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సకీక్ క్క ఆరోపణలను తోసిపుచ్చారు. , ఆమె "ఇమ్మిగ్రేషన్ పాలసీలను పాటించలేదని" "అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్నదని" ప్రకటించారు. డిటైనీలకు సరైన భోజనం, వైద్య చికిత్స, కుటుంబ సభ్యులు ,న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు.
2025 జనవరి నుండి 100,000 మందికి పైగా వ్యక్తులను అమెరికా నుంతి డిపోర్ట్ చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చట్టవిరుద్ధ స్థితిలో ఉన్న ఎవరినైనా "క్రిమినల్"గా పరిగణిస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. సకీక్ యొక్క కుటుంబం 2011లో అసైలం కోసం దరఖాస్తు చేసినప్పటికీ తిరస్కరించారు. వారికి ఎక్కడా పౌరసత్వం లేని కారణంగా డిపోర్ట్ చేయలేకపోయారు. వార్డ్ సకీక్ జూలై 3న ICE నిర్బంధం నుండి విడుదలయ్యారు. మియామిలో మీడియా సమావేశం పెట్టి తన పరిస్థితులను వెల్లడించారు. తన కుటుంబం ఇమ్మిగ్రేషన్ విధానాలను పాటించింందని ఆమె చెబుతున్నారు. సకీక్ పరిస్థితులే కొన్ని వేల మంది అనుభవిస్తున్నారని అంతర్జాతీయగా భావిస్తున్నారు.





















