World News: సార్.. మీరు ప్రెగ్నెంటా..? అని అడిగితే సమాధానం చెప్పాల్సిందే- అమల్లోకి వచ్చిన కొత్త రూల్
UK News: మగవాళ్లు కూడా ప్రెగ్నెన్సీ స్టేటస్ చెప్పాలని యూకేలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఎక్స్-రే, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే మగ పేషంట్లు ప్రెగ్నెంట్ స్టేటస్ చెప్పాల్సి ఉంటుంది.
Pregnancy Status: ఎక్స్-రే, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే మగ పేషంట్లకు చెందిన ప్రెగ్నెంట్ స్టేటస్(Pregnancy Status) తెలుసుకోవాలని బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. 12 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మగవారిని ఆ ప్రశ్నలు వేయాలని అధికారులు సూచించారు.. ఇకపై ఆ దేశంలో మగవాళ్లు కూడా ప్రెగ్నెన్సీ స్టేటస్ చెప్పాల్సిందే.. సీటీ స్కాన్, ఎక్స్-రే, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి స్కానింగ్‌లు చేయించుకునే మగ పేషంట్లకు చెందిన ప్రెగ్నెంట్ స్టేటస్ (Pregnancy Status) తెలుసుకోవాలని ఆ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా సీటీ, ఎక్స్ రే లాంటి స్కానింగ్ చేయించుకునే ఆడవారిని ఈ ప్రశ్నలు అడుగుతుంటారు డాక్టర్లు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డపై కిరణాల ప్రభావం ఉంటుంది కాబట్టి ముందుగానే అడిగి అవసరాన్ని బట్టి స్కానింగ్ రాయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మహిళ కడుపుతో ఉంటే మరీ అత్యవసరం అయితే తప్ప అలాంటి స్కానింగ్‌ల జోలికి వెళ్లరు డాక్టర్లు. తాజాగా ఇదే వివరాలు బ్రిటన్‌లో మగ పేషెంట్లను కూడా అడుగతున్నారు. ఏంటీ వింతగా అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం. బ్రిటన్ ఆరోగ్యశాఖాధికారులు ఈ సరికొత్త వింత ఆదేశాలను జారీ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ప్రతి రోగీ తన ప్రెగ్నెస్నీ స్టేటస్ చెప్పాల్సిందే
మగవాళ్లేమిటి ప్రెగ్నెన్సీ రావడం ఏంటని నోరెళ్లబెడుతున్నారు కదా.. దీనికి కారణం కూడా లేకపోలేదు. అదేమిటీ అంటే.. ఇటీవల ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సీటీ స్కాన్ చేయించుకున్నాడు. అయితే అతను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఆ స్కానింగ్ జరిగింది. తొలిసారి డాక్టర్లకు కూడా వింత అనుభవం ఎదురుకావడంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. ఇకపై 12 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మగ పేషెంట్లు సైతం ఇలాంటి ప్రశ్నలు వేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను పూరించేలా మగ పేషెంట్ల కేస్ షీట్‌లోనూ మార్పులు చేశారు. ఇదే ఇప్పుడు యూకేలో హాట్ టాపిక్ అయ్యింది. కొత్త ఎంక్వైరీ ఫారాలను ఇప్పటికే లండన్‌లోని పలు ఆస్పత్రలు వాడడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం .. పురుషులైనా, ట్రాన్స్‌జెండరైనా, ఇంటర్‌సెక్స్ పేషెంట్లయినా సరే.. వారి ప్రెగ్నెన్సీ స్టేటస్ తెలుసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్కానింగ్ చేయించుకున్నవారు ఎవరైనా సరే.. వాళ్లు జెండర్‌తో పాటు ఫెర్టిలిటీ స్టేటస్ చెప్పాల్సి ఉంటుంది.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మానవహక్కుల ప్రచారకర్తలు
యూకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేక మంది వైద్యులు, మానవ హక్కుల ప్రచార కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో జరిగిన ఒక సంఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా చట్టం చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు. ఇది మగజాతిని అవమానపర్చడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డాక్టర్ లూయిస్ ఇర్విన్ మాట్లాడుతూ మగవారు గర్భం దాల్చడం అనేది సాంకేతికంగానే అసాధ్యం. అలాంటప్పుడు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కూడా సహేతుకమైనదని వాదిస్తున్నారు.