NASA Mars Crater : ఏలియన్స్ ఉన్నట్లుగా మరో సాక్ష్యం ? నాసా కొత్త ఫోటో చూస్తే అలాగే అనిపిస్తుంది మరి
నాసా మార్స్‌పై అత్యాధునిక కెమెరాతో ఓ ఫోటో తీసింది. దాన్ని ప్రపంచం ముందు పెట్టింది. ఆ ఫోటో చూసిన వారికి ఏమనిపిస్తోందంటే ?
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా విడుదల చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను హై రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ అనే విధానంలో తీశారు. ఆ ఫోటో చాలా పెద్దదిగా కనిపిస్తోంది కానీ.. నిజంగా అయితే యాభై సెంటిమీటర్ల అంటే 19.7 ఇంచ్‌ల స్థలంలో తీసిందే.
View this post on Instagram
ఆ ఫోటో చాలా క్లియర్‌గా ఉంది. చూస్తూంటే ఏలియన్ పాదముద్రలా ఉందని నెటిజన్లు కామెట్లు చేస్తున్నారు. దాదాపుగా ఐదు లక్షల మంది ఈ ఇన్‌స్టాగ్రాం ఫోటోను లైక్ చేశారు. అందులో అత్యధిక మంది అఅభిప్రాయం అది ఏలియన్ ఫుల్ ప్రింటే. అయితే నాసా మాత్రం అది ఓ జీవి ఫుట్ ప్రింట్ అని చెప్పడం లేదు. మార్స్‌పై ఫోటో తిసిన ప్రాంతంలో ఉన్న ఆకారంగానే చెబుతోంది. నాసా మార్స్‌పై అనేక రకాల పరిశోధనలు చేస్తోంది. అత్యాధునిక హై రైజ్ ఇమేజింగ్‌తో రహస్యాలు బయటకు తెలుస్తోంది. కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇంత వరకూ ఏలియన్స్ జాడ కనిపించలేదు. ఏం కనిపించినా ఏలియన్స్ అుకోవడం నెటిజన్లకు కామన్ అయిపోయింది .
ఏలియన్స్ నిజంగా ఉన్నారా లేరా అన్నది ఎవరికీ తెలియదు. ఇంతవరకూ జరిగిన పరిశోధనల్లో ఏలియన్స్ ఉన్నట్లుగాఎవరూ గుర్తించలేదు. కానీ ఈ పేరుతో మాత్రం పెద్ద ఎత్తు నసినిమాలు తీశారు. ఏలియన్స్ ఉన్నట్లుగా చూపించారు. అవతార్ లాంటి సినిమాలు మరో రకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. ఇలాంటి కారణాల వల్ల మార్స్ పై నాసా చేసే పరిశోధనలు తీసే ఫోటోలపై ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఏర్పడుతోంది. ప్రతీదానికి ఏలియన్స్‌తో ముడిపెట్టుకోవడం కామన్ అయిపోయింది