Tsunami Effect: సునామీ దెబ్బకు చేపల్లా తీరానికి కొట్టుకొస్తున్న భారీ తిమింగళాలు- 30 దేశాలకు పొంచి ఉన్న ముప్పు
8 magnitude earthquake hits russia tsunami warnings | రష్యా పసిఫిక్ తీరంలో కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసింది. దాదాపు 30 దేశాలపై ప్రభావం చూపుతోంది.

Earthquake hits Russia Tsunami Alert | టోక్యో: రష్యాలోని కమ్చట్కా తీరంలో సంభవించిన భారీ భూకంపం సునామీగా మారింది. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతలో సంభవించిన భూకంపం కారణంగా జపాన్, అమెరికా, రష్యాలు పలు ప్రాంతాల్లో సునామీ సంభవించింది. జపాన్ తీరంలో అయితే రాకాసి అలలు తీరంలో ప్రతాపం చూపుతున్నాయి. పసిఫిక్ మహా సముంద్రంలో ఆవిర్భవించిన సునానీ జపాన్ తీరాన్ని తాకింది. 3 మీటర్లకు పైగా రాకాసి అలలు ఎగసి పడుతుంటే.. తిమింగళాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి.
చేపల్లా తీరానికి కొట్టుకొస్తున్న తిమింగళాలు
సునామీ హెచ్చరికలతో జపాన్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో సమస్యలు సృష్టించిన పుకుషిమా అణువిద్యుత్ కేంద్రం నుంచి ఉద్యోగులకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల తీరంలో రాకాసి అలల తాకిడి తిమింగళాలు చిన్న చేపల్లా తీరానికి కొట్టుకురావడం సునామీ తీవ్రతకు నిదర్శనం. కొన్నిచోట్ల మీటర్ వరకు ఎలలు ఎగసి పడుతున్నాయి. టొకచాయ్ పోర్టులో, ఎరిమో సిటీలో 40 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెండాయ్ ఎయిర్ పోర్టును మూసివేశారు.
CORRECTION: #NHK broadcast shows multiple #whales washed ashore, apparently by #tsunami waves, after the strong earthquake off #KamchatkaPeninsula, #Russia https://t.co/U5zrptxbVu pic.twitter.com/aVpBGOJuLy
— ShanghaiEye🚀official (@ShanghaiEye) July 30, 2025
సునామీ ప్రభావం ఎక్కడ ఎలా ఉంటుందంటే..
- రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో సంభవించిన 8.7 తీవ్రత భూకంపం పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ భారీ భూకంపం కారణంగా దాదాపు 30 దేశాల వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రష్యా, జపాన్, అమెరికా తీర ప్రాంతాలను ఇప్పటికే సునామీ తాకింది. ముఖ్యంగా జపాన్, రష్యా తీరాల్లో సునామీ ప్రభావం అధికంగా ఉంది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులలో సునామీ హెచ్చరిక జారీ చేశారు.
- రష్యా, జపాన్, అమెరికాలోని హవాయి లాంటి ప్రాంతాల్లో సునామీ కారణంగా అలలు 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వస్తాయని అధికారులు తెలిపారు.
- జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, పాల్మిరా ఐలాండ్, హవాయి, కిరిబాటి, పెరూ, సమోవా, గువామ్, మిడ్‌వే ఐలాండ్, సోలోమన్ దీవులలో 1 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు అలలు వస్తాయని హెచ్చరించారు.
- కొలంబియా, కుక్ దీవులు, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, ఎల్ సాల్వడార్, ఫిజీ, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్, గ్వాటెమాలా, ఇండోనేషియాలలో 0.3 మీటర్ల నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు ఎగసి పడనున్నాయి.
- ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా, మలేసియా, వియత్నాం బ్రూనై దేశాల్లో 0.3 మీటర్ల లోపు అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాల ప్రజలతో పాటు న్యూజిలాండ్ వాసులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాలిఫోర్నియా, హవాయి అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల ప్రజలు సునామీ హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలని.. తీర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ +1-415-483-6629 కు కాల్ చేయాలని అమెరికాలోని పశ్చిమ రాష్ట్రాల్లోని భారతీయులకు కాన్సులేట్ జనరల్ అధికారులు సూచించారు.






















